సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు…ఎన్ని హిట్ అయ్యాయో ?

Super Star Krishna Movies In telugu : సూపర్ స్టార్ కృష్ణ 1965లో తేనెమనసులు మూవీతో కెరీర్ ఆరంభించగా,1966లో రెండు చిత్రాలు,1967లో 7మూవీస్ చేసాడు. 1969లో అయితే 15మూవీస్ చేసాడు. మొదటి సినిమా చూసాక హీరోగా కృష్ణ పనికిరాడని అనుకున్న వాళ్ళను సవాల్ గా తీసుకుని రేయింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించారు.

మొహమాటం కోసం సినిమాలు ఒప్పుకోవడంతో మొదట్లో మూడు షిఫ్ట్ లలో పనిచేసాడు. ఇక కునుకు తీస్తున్నప్పుడు కూడా నిద్రపోయే సన్నివేశాలున్నాయి, మా కాస్ట్యూమ్స్ వేసుకుని విశ్రమించామని దర్శక నిర్మాతలు కోరారంటే కృష్ణ ఏ లెవెల్లో కష్టపడ్డారో తెలుస్తుంది. అంత బిజిలో కూడా టక్కరి దొంగ, చక్కని చుక్క మూవీలో ద్విపాత్రాభినయం చేసిన కృష్ణ కు అదే సమయంలో ఆస్తులు అంతస్తులు షూటింగ్ కూడా ఏకకాలంలో జరిగాయి.

పగలు ఓ సినిమా, రాత్రిళ్ళు మరో సినిమా చేసాడు. రెండూ ఒకరోజు తేడాలో రిజీజయ్యాయి. ఇక 1972లో 18 సినిమాల్లో నటించి, కృష్ణ ఓ రికార్డ్ క్రియేట్ చేసాడు. బిజీగా ఉన్నా సరే, కథ నచ్చి మా ఇంటి వెలుగు మూవీలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఇక అభిమానవతి మూవీతో తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ వేసాడు.

రామరాజ్యంలో రక్తపాశం మూవీలో కూడా అన్నదమ్ములుగా డ్యూయెల్ రోల్ వేసాడు. నిజానికి దేశంలో ఎమర్జెన్సీ కావడంతో రామరాజ్యంలో రక్తపాతం మూవీ పేరుని రక్తపాశం గా మార్చాల్సి వచ్చింది. ఇక నటుడు బాలయ్య తీసిన చుట్టాలున్నారు జాగ్రత్త మూవీలో కృష్ణ ద్విపాత్రాభినయం అదిరింది. ఇక మలయాళ మూవీ అంత కు రీమేక్ గా అంతంకాదిది ఆరంభం మూవీలో అసలు పోలికలు లేని రెండు విభిన్న పాత్రల్లో కృష్ణ నటించాడు.

కన్వర్ లాల్ పాత్ర ఫాన్స్ కి బాగా నచ్చింది. విజయనిర్మల నటించి దర్శకత్వం వహించింది. దాసరి నారాయణరావు తీసిన బండోడు గుండమ్మ మూవీలో కృష్ణ ద్విపాత్రాభినయం చేసాడు. చట్టానికి వేయికళ్లు మూవీలో కూడా రెండు పాత్రల్లో కృష్ణ నటించడం,రెండూ పోలీసాఫీసర్ పాత్రలు కావడం విశేషం. 1983లో శక్తి మూవీ లో కృష్ణ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు.

డాక్టర్ సీనియాక్టర్ మూవీలో డాక్టర్ గా, యాక్టర్ గా కృష్ణ నటించాడు. జయసుధతో కల్సి తొలిసారి కృష్ణ నటించిన చిత్రం ఇదే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో జయసుధ, రాధ నటించారు. ఇక దాసరి డైరెక్షన్ లో వచ్చిన యుద్ధం మూవీలో కృష్ణ,కృష్ణంరాజు కూడా తండ్రులుగా, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు.

దొంగలు బాబోయ్ దొంగలు మూవీలో కవలపిల్లలుగా కృష్ణ నటించాడు. రోబో లు ప్రవేశ పెట్టిన ఘనత ఈ సినిమా నిర్మాత డూండీకి దక్కుతుంది. ఇక బిగ్గెస్ట్ హిట్ అగ్నిపర్వతంలో కృష్ణ రెండు విభిన్న పాత్రలతో అలరించాడు. జమదగ్ని పాత్ర హైలెట్ అయింది. తర్వాత మహా మనిషి మూవీలో కృష్ణ డ్యూయల్ రోల్ వేసాడు.

విజయబాపినీడు డైరెక్షన్ లో వచ్చిన కృష్ణ గారడీలో తండ్రీ కొడుకులుగా కృష్ణ నటించాడు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో సర్దార్ కృష్ణమనాయుడు నాయుడు మూవీలో తండ్రీ కొడుకులుగా కృష్ణ నటించాడు. అగ్ని కెరటాలు మూవీలో కృష్ణ డ్యూయల్ రోల్ వేసాడు. అత్తమెచ్చిన అల్లుడు మూవీలో రెండు పాత్రలను కృష్ణ వేయగా, మేనత్తగా భానుమతి నటించారు. ఎస్ నేనంటే నేనే మూవీ లో కూడా కృష్ణ రెండు పాత్రలు వేసాడు.