MoviesTollywood news in telugu

అల్లుడా మజాకా సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Alluda majaka Telugu Full Movie :ఘరానా మొగుడు తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ చిరంజీవితోనే సినిమా తీస్తానని గట్స్ ఉన్న నిర్మాతగా కె దేవి వరప్రసాద్ కి పేరుంది. ఈయన తీసిన అల్లుడా మజాకా ఎంతటి హిట్ కొట్టిందో చెప్పలేనిది. డేట్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కనుక ఈలోగా మిగిలిన హీరోలతో తీయండి, నిర్మాత అన్నాక అందరితో సినిమాలు తీస్తే మంచిది కదా అని చిరంజీవి చెప్పినా సరే, దేవీవరప్రసాద్ వినలేదు.

ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే తీస్తా అని భీష్మించారు. అలా రెండున్నరేళ్లు వెయిట్ చేసి తీసిన మూవీయే అల్లుడా మజాకా. చిరంజీవితో డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ పనిచేసిన ఏకైక చిత్రం కూడా ఇదే. నిజానికి అప్పుల అప్పారావు మూవీ చూపించడానికి చిరంజీవిని ఈవీవీ పిలిస్తే, చిరు వెంట దేవి వరప్రసాద్ వచ్చారు.

సినిమా చూసాక , చిరుతో మా బ్యానర్ లో ఓ సినిమా చేసిపెట్టాలని దేవి వరప్రసాద్ ఆఫర్ ఇచ్చాడు. చిరుతో సినిమా అంటే మాటలు కాదు కదా. అందుకే రెండేళ్లు వెయిట్ చేసి కథ రెడీ చేసారు. ఘరానా అత్తకి, సొగసరి అల్లుడికి జరిగే టీజింగ్ డ్రామాతో పోసాని కృష్ణమురళి రాసిన కథ ఇది. అత్త పాత్రకోసం వాణిశ్రీ అనుకున్నా, చివరకు సీనియర్ నటి లక్ష్మిని సెలక్ట్ చేసారు.

హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, రంభ సెలెక్ట్. చిరు, రమ్యకృష్ణలపై తొలిక్లాప్ ఇచ్చి ఎన్టీఆర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. డైరెక్టర్ ఇవివి శ్రమ, నిర్మాత ఖర్చుకి వెనుకాడకుండా పడ్డ కష్టాన్ని గుర్తించి 25శాతం రెమ్యునరేషన్ కూడా చిరంజీవి స్వచ్ఛందంగా తగ్గించుకోవడం అప్పట్లో విశేషం.

ఇక అంతకు ముందు చిరుకి కొన్ని ప్లాపులు వచ్చినా ఈ మూవీ బిజినెస్ పై పడలేదు. నిర్మాత దేవి వరప్రసాద్ మీద నమ్మకం అలాంటిది. అందుకే ఒక్కో ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు వచ్చారు. ఇక రిలీజయిన మూడు రోజుల్లో ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

1995 ఫిబ్రవరి 24న రిలీజైన ఈ మూవీ హిట్ అయిన ఆనందం పొందుతున్న వేళ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే చిరు ఎదుర్కొన్న తొలి వివాదం ఇదే. వివాదం పక్కనే విజయం ఉంటుందని ఈ మూవీ నిరూపించింది. నిర్మాత దేవి వరప్రసాద్ కూడా ఈ సినిమా సన్నివేశాలపై ఎదురుదాడికి దిగుతూ కౌంటర్ ఇవ్వడం అప్పట్లో సంచలనం.