సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్ని టాప్ మూవీస్ ఉన్నాయో…?

Krishna Super Hit Movies :నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన తేనెమనసులు మూవీతో 1965లో కృష్ణ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నాడు. 1966లో వచ్చిన గూఢచారి 116 సినిమా సూపర్ డూపర్ హిట్. శోభన్ బాబు కొద్దిసేపు ఏజంట్ గా కన్పించి చనిపోయాక కృష్ణ ఎంటర్ అవుతాడు. మల్లికార్జునరావు డైరెక్ట్ చేసారు. 1967జులై 1న రిలీజైన సాక్షి సినిమాకు బాపు డైరెక్షన్. కృష్ణకు నటనకు మంచి పేరు తెచ్చింది. ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు మూవీ సూపర్ హిట్. కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి వి రామచంద్రరావు డైరెక్టర్ గా వ్యవహరించారు. జాతీయ ఫిలిం ఫేర్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్న పండంటి కాపురం మూవీ 1972జులై 21న విడుదలై కృష్ణ కెరీర్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఎస్వీ రంగారావు నటన హైలెట్.

అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని 1974మే 1న వచ్చిన అల్లూరి సీతారామరాజు మూవీ కృష్ణ కెరీర్ లో మరపురాని మూవీగా నిల్చింది. తెలుగులో తొలి కౌబాయ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు మూవీ మంచి హిట్ గా నిల్చింది. కె ఎస్ ఆర్ దాస్ డైరెక్ట్ చేసారు. విజయనిర్మల డైరెక్షన్ లో కుటుంబ కథా చిత్రంగా వచ్చిన మీనా మూవీ సూపర్ హిట్ అయింది. కృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన మాయదారి మల్లిగాడు మూవీ కృష్ణకు మంచి పేరు తెచ్చింది.

తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించిన పాడిపంటలు మూవీ 1976లో రిలీజై కృష్ణ కెరీర్ లో మంచి హిట్ గా నిల్చింది. క్లాస్ గా శోభన్ బాబు, మాస్ గా కృష్ణ నటించిన రామానాయుడు నిర్మించిన ముందడుగు మూవీ సూపర్ హిట్. రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపులు ప్రధాన ఇతివృత్తంగా కృష్ణ 200వ చిత్రంగా వచ్చిన ఈనాడు మూవీ కృష్ణ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఊరికి మొనగాడు మూవీ అప్పట్లో ఓ సెన్షేషన్. కృష్ణ , జయప్రద జంటగా నటించిన ఈ చిత్రంలోని సాంగ్స్ సూపర్ హిట్. చుట్టాలున్నారు జాగ్రత్త మూవీ కృష్ణ ,శ్రీదేవి కాంబోలో సూపర్ హిట్.

ఘరానా దొంగ మూవీతో కృష్ణ, శ్రీదేవి కాంబోలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన మూవీ సూపర్ హిట్ గా నిల్చింది. 1985లో భోగి కానుకగా వచ్చిన అగ్నిపర్వతం మూవీని కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసాడు. డబుల్ యాక్షన్ తో కృష్ణ తన నటనతో అదరగొట్టాడు. అదే ఏడాది కృష్ణ,శ్రీదేవి జంటగా వచ్చిన పచ్చని కాపురం ఆల్ టైం హిట్ గా నిల్చింది. అలాగే కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన వజ్రాయుధం మూవీ సూపర్ హిట్ గా నిల్చింది. కృష్ణ తొలిసారి డైరెక్షన్ చేసిన సింహాసనం మూవీ1986మార్చి 21న రిలీజై, కృష్ణ కేరీర్ లో కలికితురాయిగా నిల్చింది.

ఈ మూవీతోనే బప్పీలహరి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా డబుల్ రోల్ లో నటించిన .. కృష్ణ , విజయశాంతి కాంబోలో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సూపర్ హిట్. కిరాయి కోటిగాడు మూవీ కృష్ణ,శ్రీదేవి జంటగా కోదండరామిరెడ్డి తెరకెక్కించిన మూవీ అప్పట్లో సెన్షేషన్. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ రుద్రయ్య కృష్ణ,శ్రీదేవి జంటగా నటించి తమ నటనతో అదరగొట్టారు. సూపర్ హిట్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో కృష్ణ నటించిన అమ్మ దొంగా మూవీ సూపర్ హిట్. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన నెంబర్ వన్ మూవీ కృష్ణ కొత్త గెటప్ తో స్టెప్పులతో అలరించారు.