MoviesTollywood news in telugu

కృష్ణార్జునులు సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Krishnaarjunulu Full Movie :కృష్ణ,శోభన్ బాబు కల్సి చాలా సినిమాల్లో నటించారు. మల్టీస్టారర్ మూవీస్ కి వీరిద్దరూ పెట్టింది పేరు. నిజానికి వీరిద్దరిదీ విభిన్న మనస్తత్వం. సినిమా,స్టూడియో అంటే ఉద్యోగం లాంటిదని, సాయంత్రం 6దాటితే ఇంటికి వెళ్ళిపోయి,ఫ్యామిలీతో గడపాలని శోభన్ బాబు ఆలోచన. అయితే చుట్టూ తనను నమ్ముకున్నవాళ్లను కాపాడుకుకుంటూ, ఏదో సంచలనం క్రియేట్ చేయడం కృష్ణ మెంటాలిటీ. వయస్సులో శోభన్ బాబు పెద్ద కావడంతో కృష్ణ ఎంతో గౌరవించేవారు. ఇద్దరూ మంచి మిత్రులు. కృష్ణ తల్లి నాగరత్నమ్మ కూడా శోభన్ బాబుని కొడుకులా చూసుకునేవారు. శోభన్ కూడా ఆమెను అమ్మ అని పిలిచేవారు.

దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తొలి మల్టీస్టారర్ గా కృష్ణ, శోభన్ బాబులతో కృష్ణార్జునులు మూవీ తెరకెక్కించారు. సీతారాములు, మనవూరి పాండవులు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ జయకృష్ణకు ఇది మూడో సినిమా. హ్యాట్రిక్ కొట్టడం కోసం మూడో సినిమాకు డేట్స్ ఇవ్వాలని దాసరిని అడగడంతో డేట్స్ ఇచ్చారు. తర్వాత కృష్ణ, ఆతర్వాత శోభన్ బాబు దగ్గరకు వెళ్లి జయకృష్ణ అడగడంతో డేట్స్ ఇచ్చారు. పాలగుమ్మి పద్మరాజు, రాజశ్రీలతో కూర్చుని నీటి,అవినీతి మధ్య దాసరి ఓ కథ రెడీ చేసారు. జయప్రద, శ్రీదేవి కూడా డేట్స్ ఇచ్చారు. ఇక కృష్ణార్జునులు టైటిల్ పెట్టారు.

మొదట కాశ్మీర్ లో శ్రీదేవి, కృష్ణపై రెండు సాంగ్స్ తో షూటింగ్ స్టార్ట్ చేసారు. సినిమాలో కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. కానీ రావు గోపాలరావు పెట్టిన చిచ్చుతో ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. చివరకు అల్లు రామలింగయ్య హితబోధతో ఇద్దరూ ఏకమై, విలన్ రావుగోపాలరావు భరతం పడతారు. 1982మార్చి 26న రిలీజైన ఈ సినిమాకోసం ఇరువురి ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సరైన కథ, కథనం లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది.