ముద్దుల మావయ్య సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Muddula Mavayya Telugu Movie :ఎస్ గోపాల్ రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై తీసిన మద్దుల మావయ్య సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ నటనకు ఆడియన్స్ నీరాజనం పట్టారు. విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 31ఏళ్ల క్రితం వచ్చింది. మావయ్య అన్న పిలుపు అనే సాంగ్ అప్పట్లో పాపులర్.

అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని బాగా చూపించారని ఆడియన్స్ చెప్పుకున్నారు. ఈ మూవీతోనే యువరత్న అనే బిరుదు బాలయ్యకు వచ్చింది. 1989లో వచ్చిన ఈ మూవీ భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పేరు మారుమోగిపోయింది. 1988లో చెన్నై రాధాకృష్ణ స్టేడియంలో షూటింగ్ స్టార్ట్.

గణేష్ పాత్రో తో కూర్చుని కథ ఫైనల్ చేసినా ఏదో వెలితి. తోలి షెడ్యూల్ బెంగుళూరులో విజయవంతంగా ముగించారు. చెన్నైలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసాక అప్పటికే తమిళంలో రిలీజైన ప్రభు మూవీ చూసిన గొల్లపరెడ్డి,మజ్జి కృష్ణమూర్తి తదితరులు ఇదే సినిమాను రీమేక్ చేస్తే అని భావించారు.హీరో,డైరెక్టర్ కి చెప్పడంతో ఒకే చెప్పేసారు.

దాంతో అంతకుముందు తీసిన షెడ్యూల్ పక్కన పెట్టేసి, తమిళ మూవీ ఎన్ తంగచ్చి పడిచ్చవా రీమేక్ హక్కులు కొనేశారు. గణేష్ పాత్రో తో కల్సి చేర్పులు మార్పులు చేసి, మరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ సీన్ తీసుకున్నారు. చెల్లెలి పాత్రకు సీత ముందు తటపటాయించినా, తర్వాత కీలకమని తెల్సి ఒప్పుకుంది.

చనిపోయే సీన్ లో సీత లీనమైపోయి చాలాసేపటికి గానీ మామూలు స్థితికి రాలేదు. దాంతో ఆమెకు ఒకరోజు రెస్ట్ ఇచ్చారు. మైసూరు, బెంగళూరు,చెన్నై లలో షూటింగ్ చేయగా, సినిమాకు 90లక్షలు ఖర్చు కాగా, ఒక కోటి 40లక్షలకు ప్రీ బిజినెస్ చేసారు. 1989ఏప్రియల్ 7న సినిమా రిలీజ్. బాలయ్య,విజయశాంతి,సీత నటన, కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ,కెవి మహదేవన్ సంగీతం,వెన్నెలకంటి పాటలు ఇలా అన్నీ కుదిరాయి.

ఈ సినిమా యాడ్స్ కి ఇచ్చిన ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయవచ్చు. అంతలా ఖర్చుచేశారు. తొలివారంలో కోటి 15లక్షలు గ్రాస్. బెంగుళూరు కాకుండా ఓ కర్ణాటక లోని ఒక ఊళ్ళో 4ఆటలతో 100రోజులు ఆడిన మూవీ రికార్డ్ క్రియేట్. మొత్తం 60సెంటర్స్ లో 100ఆడింది.