గుప్పెడు తింటే చాలు చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు సమస్యలు అసలు ఉండవు

little millet Health benefits In telugu : సిరి ధాన్యాలలో ఒకటైన సామలను రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి సిరి ధాన్యాలను తినటం అలవాటు చేసుకుంటున్నారు. సామలను అన్నీ వయస్సుల వారు తినవచ్చు. బాగా జీర్ణం అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
samalu benefits
వీటిలో ఫైబర్,తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్, నెమ్మదిగా జీర్ణం అవ్వటం, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సామలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేసి గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. సామలు హైపోగ్లైసీమిక్ మరియు హైపోలిపిడెమిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి.
Diabetes diet in telugu
వీటిలో ఉండే పాలీఫెనాల్స్, ఫినాలిక్ సమ్మేళనాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు డయాబెటీస్ నియంత్రణలో,గుండె ఆరోగ్యంగా ఉండటానికి,జీర్ణ సమస్యలు,కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

సామలలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ B3 (నియాసిన్) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫాస్ఫరస్ సమృద్దిగా ఉండుట వలన కొవ్వు జీవక్రియ, శరీర కణజాల మరమ్మత్తు మరియు శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.