Healthhealth tips in telugu

బంగాళాదుంప జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే…అసలు వదిలిపెట్టరు

Potato Juice Health Benefits In telugu : బంగాళాదుంప అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.
సాదారణంగా బంగాళాదుంపతో చిప్స్, వేపుళ్ళు ఇలా రక రకాలుగా చేసుకుంటూ ఉంటాం. బంగాళదుంపతో ఎలా చేసుకున్న మంచి రుచి వస్తుంది. బంగాళాదుంపలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే బంగాళదుంప జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బంగాళాదుంప రసంలో విటమిన్ సి, ఫైబర్, బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్ మరియు కొంత ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Joint Pains
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పుల నుండి మోకాళ్లు, మోచేతులు, కీళ్ళు, మెడ, భుజాలు… ఇలా అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు బంగాళదుంప జ్యూస్ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ కరుగుతుంది. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు దాంతో బరువు ఈజీగా తగ్గుతారు.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో తగినంత రోగ నిరోధకశక్తి ఉండాల్సిన అవసరం ఉంది. గుండె సమస్యలు రాకుండా సహాయపడుతుంది.గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉండటమే కాకుండా ముడతలను తగ్గిస్తుంది.
blood thinning
బంగాళాదుంప రసంలో విటమిన్ బి (నియాసిన్) పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ మరియు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బంగాళదుంప జ్యూస్ మంచిది కదా అని ప్రతి రోజు తాగకూడదు. వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్నవారు బంగాళదుంప జ్యూస్ కి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ జ్యూస్ వలన కడుపునొప్పి పెరిగే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.