MoviesTollywood news in telugu

చిరు, వెంకీ, నాగ్ ల ‌భారీ మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయింది… కారణం ఎవరు?

Chiranjeevi and Nagarjuna and Venkatesh Multi Starrer Movie : మన అభిమాన నటులు కలిసి నటిస్తే చూడాలని ప్రతి అభిమానికి ఉంటుంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్, అక్కినేని ల దగ్గర నుంచి మల్టీస్టారర్ మూవీస్ ఉన్నాయి. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి. పెద్ద, చిన్న హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నారు.

అయితే గతంలో చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేసిన ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఎందుకో ఆగిపోయింది. అవును 2002లో ఇంద్ర సినిమా తర్వాత తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాలను కున్నాడు.

అది కూడా తన 100వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నాడు. అంతేకాదు అప్పట్లో ఈ మల్టీస్టారర్ మూవీకి చిన్నికృష్ణ ఓ కథను కూడా రెడీ చేసి దర్శకేంద్రుడికి అందజేశాడు. అంతేకాదు ఈ సినిమాకు ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా మూడు హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో కథ, కథనాన్ని రెడీ చేసాడు.

అంతా ఓకే అనుకున్నాక ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ మూవీని అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుతో పాటు, అల్లు అరవింద్, అశ్వనీదత్ నిర్మించడానికి రెడీ అయ్యారు. క్లైమాక్స్.. ఇతరత్రా కొన్ని సీన్స్ కుదరకపోవడం వల్లే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే స్టాప్ అయింది.

అలా ఒకే స్క్రీన్ పై చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను చూడాలకున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తెరకెక్కకపోవడంతో నిరాశ తప్పలేదు. ఒకవేళ ఈ సినిమా రాఘవేంద్రరావు తెరకెక్కించనట్టైయితే.. తెలుగులో అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ అయి ఉండేది. ఆయన వంద చిత్రంగా చరిత్రలో నిలిచిపోయే మూవీ అయ్యేదదనడంలో సందేహం లేదు.