హీరో గోపిచంద్ భార్య ఎవరో తెలుసా… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా…!
Tollywood hero gopichand wife reshma : ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ నటవారసుడుగా గోపిచంద్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సరే… విలన్ గా మాత్రం మొదటి సినిమాకే ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరవాత యజ్ఞం సినిమాలో హీరోగా నటించి సక్సెస్ ను అందుకున్నాడు.
ఈ సినిమా హిట్ కావటంతో గోపీచంద్ ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. గోపీచంద్ మే 12, 2013 లో రేష్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇప్పుడు వారికీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు రేష్మ గురించి తెలియని విషయాలను తెలుసుకుందాం.
రేష్మ హీరో శ్రీకాంత్ మేనకోడలు. శ్రీకాంత్ సొంత అక్క కూతురు రేష్మ. గోపీచంద్ తన బాబుకి తన భార్య కోరిక ప్రకారం విరాట్ అని పేరు పెట్టాడు. రేష్మ అమెరికాలో చదివింది. గోపీచంద్ రేష్మ ఫోటో చూసి నచ్చి సంబంధం మాట్లాడమని చెప్పాడు. వీరి పెళ్లి పెద్దగా సీనియర్ నటుడు చలపతిరావు ఉండి పెళ్లి జరిపించారు.
శ్రీకాంత్ తన మేనకోడలికి గోపీచంద్ నా కంటే చాలా మంచోడని చెప్పాడు. అంతేకాక కళ్ళు మూసుకొని చేసుకోవచ్చని చెప్పాడు. ప్రస్తుతం గోపిచంద్ రేష్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా రేష్మ గోపిచంద్ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు.