Healthhealth tips in telugu

రాత్రి సమయంలో దానిమ్మ పండు తింటే ఏమి జరుగుతుందో తెలుసా ?

pomegranate Health benefits In telugu : దానిమ్మ పండు దాదాపుగా సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. దానిమ్మలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. pomegranate ను గింజల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే గింజలు తింటే మన శరీరానికి అవసరమైన పైబర్ అందుతుంది.

దానిమ్మ పండులో ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, విటమిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌తో పాటు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్దిగా ఉంటాయి. దానిమ్మను రాత్రి సమయంలో తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
Joint Pains
అలాంటి వారికీ దానిమ్మ పండు చాలా బాగా సహాయపడుతుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు దానిమ్మరసంలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారి ఎముకలకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందటానికి దానిమ్మ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది.
sleeping problems in telugu
అలాగే మనలో చాలామంది మారిన జీవనశైలి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య నుండి బయట పడాలంటే రాత్రి పడుకునే ముందు ఒక కప్పు దానిమ్మ గింజల్లో కొంచెం పెరుగు కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
Weight Loss tips in telugu
అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆకలి తొందరగా వేయదు. అంతేకాకుండా ఉదయం సమయంలో చాలా ఉషారుగా ఉంటారు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండుట వలన ధమనులలో రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి అడ్డంకులు లేకుండా రక్తప్రసరణ జరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.