MoviesTollywood news in telugu

Ram Charan వదిలేసిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో చూడండి

Ram Charan rejected Movies In Telugu : టాలీవుడ్ లో అభిమానులు తమ అభిమాన నటుని గురించి ఏ విషయం తెలుసుకోవటానికి అయినా సిద్దంగా ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా 2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ హీరోగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్న చెర్రీ ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాసాడు.

తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులతో చేయకుండా చరణ్ నో చెప్పాడు. చిరుత మూవీ రిలీజ్ అయినవెంటనే గౌతమ్ మీనన్ నుంచి రామ్ చరణ్‌కు ఆఫర్ వచ్చింది. అయితే అప్పటికే ఈయన మగధీర సినిమాకు కమిట్ కావడంతో వదిలేసు కున్నాడు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీని సూర్యతో చేసి హిట్ కొట్టాడు.

అయినా గౌతమ్ మీనన్ వదలకుండా ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా కథను కూడా రామ్ చరణ్‌కు చెప్పాడు. కానీ ఆరెంజ్ సినిమాతో అప్పుడే ఓ ఫ్లాప్ లో ఉన్న చెర్రీ క్లాస్ కథలు మనకు సెట్ అవ్వవని రిజెక్ట్ చేసాడు. దాంతో గౌతమ్ మీనన్ ఆ మూవీని నానితో చేసాడు. ఒకప్పుడు వరుస హిట్స్ దూసుకెళ్లిన మణిరత్నంతో సినిమా చేయాలని ప్రతీ హీరోకు ఉంటుంది.

కానీ ఓకే బంగారం కథ నచ్చినా కూడా అప్పుడు ఇతర సినిమాలు ఉండటంతో చెర్రీ ఆ ఛాన్స్ కోల్పోయాడు. దుల్కర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. తెలుగులోనూ ఓకే బంగారం విజయం నమోదుచేసుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి రెండు హిట్స్ తర్వాత డైరెక్టర్ మేర్లపాక గాంధీ నేరుగా చరణ్‌కు కృష్ణార్జున యుద్ధం కథ చెప్పినప్పటికీ నాయక్‌లో ద్విపాత్రాభినయం చేయడం, వెంటనే మరోసారి డబుల్ రోల్ ఎందుకని వదిలేసుకున్నాడు.

అంతేకాదు మెగా కుటుంబానికి బాగా దగ్గర గా ఉండే కళ్యాణ్ కృష్ణ కురసాల అప్పటికే సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్స్ ఇచ్చాడు.
అయినా కూడా ఈయన చెప్పిన నేల టిక్కెట్టు కథ చరణ్‌కు ఎందుకో నచ్చకపోవడంతో నో చెప్పేసాడు. మొత్తానికి చెర్రీ రిజక్ట్ చేసిన వాటిలో ఓకే బంగారం, సూర్య సన్నాఫ్ కృష్ణణ్ సినిమాలు మాత్రమే విజయం సాధించి మిగిలిన మూడు డిజాస్టర్ అయ్యాయి.