MoviesTollywood news in telugu

Pawan Kalyan… షూటింగ్ మొదలు పెట్టాక ఆగిపోయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Power Star Pawan Kalyan Movies : పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు అయినా వేచి చూడటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలు చేసాడు. కానీ క్రేజ్ మాత్రం ఎవరికీ లేనంత ఉంది.

అయితే దాదాపు 10 మూవీస్ ప్రకటన చేసినా వివిధ కారణాల వలన ఆగిపోయాయి. సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై తీయాలన్న చెప్పాలని ఉంది మూవీ తీయాలని అనుకున్నారు. అమీషా పటేల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆగిపోయిన ఈ మూవీ నువ్వేకావాలి సినిమాగా తెరకెక్కింది.

జానీ సినిమా తర్వాత సత్యాగ్రహి మూవీ తీయాలని పవన్ కథ. ఎం ఎం రత్నం ప్రొడ్యూసర్ గా సెట్స్ మీదికి వెళ్లకుండానే ఆగిపోయింది. జీసస్ క్రైస్ట్ పేరిట పవన్ తో ఓ మూవీ చేయాలని సింగీతం శ్రీనివాసరావు తీయాలని భావించి ప్రకటన కూడా చేసారు. ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లారెన్స్ తో ఆ సినిమా చేయాలన్న టాక్ వచ్చినా సెట్స్ మీదికి వెళ్ళలేదు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో కోబలి మూవీ పవన్ తో చేయాలనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్నా ఎందుకో ఆగింది. అయితే ఆ కథనే అప్ డేట్ చేసి,జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత గా చేసారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని పవన్ ని అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో మహేష్ బాబు నటించాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా పవన్ తో ఓ మూవీ చేయాలనుకున్నా సెట్స్ మీదికి రాలేదు. సంపత్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ 2ప్రకటన చేసినా ఎందుకో ఈ మూవీ ముందుకు వెళ్ళలేదు.

అలాగే కాటమరాయుడు కన్నా ముందే ఎస్ జె సూర్యతో ఓ సినిమా స్టార్ట్ చేసారు. కానీ ముందుకు వెళ్ళలేదు. వేదాళం మూవీ రీమేక్ పవన్ తో అనుకున్నా ఆగిపోయి, అదే మూవీ ఇపుడు చిరంజీవితో స్టార్ట్ చేస్తున్నారు. ఖుషి 2ప్రకటన వచ్చినా ఎందుకో ఆగిపోయింది. పోకిరి,అతడు,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి మూవీస్ కూడా పవన్ తో తీయాల్సినవే మిస్ అయ్యాయి.