MoviesTollywood news in telugu

Mahesh Babu తో సిగరెట్ మాన్పించింది ఎవరో తెలుసా? దాని వెనక ఉన్న కధేమిటి?

Tollywood Hero mahesh babu:మహేష్ బాబు ఒకప్పుడు విపరీతంగా స్మోక్ చేసేవాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు నో స్మోకింగ్ జోన్ లోకి వచ్చేసాడట. గతంలో విపరీతంగా సిగరెట్స్ తాగే అలవాటు గల మహేష్ బాబు రోజుకి రెండు నుంచి మూడు పెట్టెల సిగరెట్స్ కాల్చేసేవాడట. అయితే అన్నీ వదిలేసి,నో స్మోకింగ్ జోన్ లోకి వచ్చేసాడు. దీనికి కూడా ఓ కథ ఉందట.
mahesh babu
మహేష్ బాబు కెరీర్ మొదట్లో సిగరెట్స్ తాగే సీన్స్ చూసి అందరూ షాకయ్యే వారట. అయితే నమ్రతను పెళ్లాడాక గుడ్ బాయ్ అయిపోయాడు. ఇక పిల్లలు పుట్టాక జెంటిల్ మ్యాన్ అయిపోయాడని అందరూ అనేమాట. అయితే మహేష్ సిగరెట్ ల జోలికి వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందట. అది కూడా ఓ ఫ్రెండ్ కారణంగా అని చెబుతారు.

ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరని అనుకుంటున్నారా , ఓ పుస్తకం. అవును. అందుకే మంచి పుస్తకం మంచి ఫ్రెండ్ లాంటిదని అంటారు. వివరాల్లోకి వెళ్తే అలెన్ కర్ అనే ఓ రచయిత రాసిన బుక్ ప్రభావం మహేష్ పై పడిందట. ఆ పుస్తకాన్ని ఓ ఫ్రెండ్ మహేష్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. నో స్మోకింగ్ జోన్ లోకి ఎలా వెళ్ళొచ్చో ఆ పుస్తకంలో ఉందట. అందుకే ఆ పుస్తకం చదివాక వెంటనే సిగరెట్స్ కి గుడ్ బై చెప్పేశాడట. అంతేకాదు ఎవరూ పొగ తాగవద్దంటూ అభిమానులకు చెప్పుతున్నాడట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."