Healthhealth tips in teluguKitchen

1 గ్లాసు తాగితే రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా అలసట, నీరసం తగ్గి తక్షణ శక్తి వస్తుంది

Dates And Anjeer Drink Benefits In telugu: ఈ రోజుల్లో మారిన జీవనశైలి, వ్యాయామం సరిగా చేయకపోవడం, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ఉదయం లావగానే అలసట, నీరసం వంటివి కూడా ఉంటాయి.

ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి రోజు ఉదయం ఇప్పుడు చెప్పే పాలను తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. కాస్త ఓపికగా ఇటువంటి ఆహారాలను తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. రాత్రి సమయంలో ఒక బౌల్ తీసుకొని దానిలో ఐదు ఎండు ఖర్జూరాలు, ఒక ఎండిన అంజీర్ వేసి నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి.
Anjeer benefits
ఉదయం నానిన ఖర్జూరాల నుంచి గింజలను తొలగించాలి. నానిన ఖర్జూరాలు, అంజీర్లను నీటితో సహా బ్లెండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోనీ పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు కాస్త వేడి అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం, అంజీర్ మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత అర స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ బెల్లం పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగిస్తే ఖర్జూరం,అంజీర్ పాలు రెడీ అయినట్టే. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలు ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉండటమే కాకుండా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు.

మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, ఆస్తమా వంటి అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
jaggery Health benefits in telugu
మెదడు పనితీరు మెరుగుపడి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది. Dates మరియు Anjeer రెండు మనకి చాలా సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ పాలను తయారు చేసుకొని తాగి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. ఈ పాలను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని వయస్సుల వారు తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.