MoviesTollywood news in telugu

Pawan Kalyan జానీ సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Pawan kalyan johnny Telugu Movie :పవన్ సినిమాలకు ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న సమయంలో పవన్ డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య జానీ సినిమా 2003ఏప్రియల్ 25న రిలీజయింది. పెద్దగా విజయాన్ని అందుకొలేని ఈమూవీ వెనుక విశేషాల్లోకి వెళ్తే, ఖుషి మూవీ తర్వాత పవన్ ఏం సినిమా తీస్తాడా అని అందరిలో ఆసక్తి ఉండేది.

వెంకటేష్, పవన్ కాంబోలో సినిమా వస్తుందన్న అంచనాలున్నాయి. అయితే ఓ అంతర్జాతీయ సంస్థ పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసాడు. ఆ యాడ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. 2002లో మొదట్లో పవన్, రేణు దేశాయ్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని గీతా ఆర్ట్స్ అధినేత , మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రకటించడంతో ఫాన్స్ లో జోష్ పెరిగింది.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అనడంతో ఇంకా ఉత్కంఠ రేగింది. డైరెక్షన్ చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా పవన్ రాసాడు. సాధారణ యువకుడిగా కనిపించడానికి ఆహార్యం కూడా మార్చుకున్నాడు. గుండు గీయించుకుని సరికొత్త హెయిర్ స్టైల్ కూడా పెంచాడు. మార్షల్ ఆర్ట్స్, మరో విద్య కోసం జపాన్ వెళ్లి నేర్చుకుని రావడంతో ఒరిజనల్ గా ఫైట్స్ ఉంటాయి.

బద్రీ తర్వాత పవన్, రేణు కల్సి చేసిన రెండవ సినిమా ఇదే. రమణ గోగుల సంగీతం అందించాడు. ప్రొడక్షన్ డిజైనర్ గా కూడా రేణుదేశాయ్ చేసింది. చోటా కె నాయుడు, శ్యాం పలావ్ ఇద్దరూ సినిమాటోగ్రాఫర్ గా చేసారు. తొలి సారి లైవ్ రికార్డింగ్ చేసి చూపిన సినిమా ఇది. అంటే 90శాతం డబ్బింగ్ ప్రత్యేకంగా లేకుండా షూటింగ్ లో ఉన్నది ఉన్నట్టు ఉంచేశారు.

పవన్ రెండు పాటలు పడడంతో పాటు చిట్టి చెల్లెలు మూవీలోకి ఈ రేయి తీయనిది సాంగ్ ని రీమిక్స్ చేసారు. రావోయి మా ఇంటికి, రావోయి మా కంట్రీకి అనే పాటను పవన్ స్వయంగా ఆలపించడం విశేషం. ఇంగ్లీషు గీతం తో సహా షూటింగ్ 2002డిసెంబర్ నాటికి పూర్తయింది. వరల్డ్ కప్ ఫైనల్ అయ్యాక మార్చి 24న ఆడియో రిలీజ్. వరల్డ్ వైడ్ 250ప్రింట్స్ తో రిలీజైన తొలితెలుగు సినిమా. చిన్నప్పుడు టు లిప్స్ స్టోరీ ఆధారంగా రాసుకున్న కథ ఇది.

హీరో చనిపోయే సీన్ ఉంటె బాగోదని మార్చేయడం వలన కథ మారిపోయింది. దాంతో స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ అయింది. పవన్ సినిమాల్లో రిమేక్ ఏది చేస్తారంటే, జానీ అని రేణు ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పడం చూస్తే , ఒరిజనల్ కథ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా డిజాస్టర్ అయిన ప్పటికీ ఇందులోని ఫైట్స్ ని బాలీవుడ్ ప్రముఖులు సైతం అందరూ మెచ్చుకున్నారు.

సినిమా డిజాస్టర్ అయితే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడం సూపర్ స్టార్ కృష్ణ నైజం. జానీతో పవన్ అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ప్లాప్ ని ఒప్పుకోవడమే కాకుండా, ఇది హిట్ అయితే ఫీల్డ్ వదిలేసేవాడినని కూడా పవన్ ఇంటర్యూలో చెప్పాడు. దీన్ని బట్టి ప్లాప్ అవ్వడం వలన గబ్బర్ సింగ్, జల్సా, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు వచ్చేవి కాదని ఫాన్స్ అనుకున్నారు.