MoviesTollywood news in telugu

Pelli Sandadi హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Pelli Sandadi heroine Deepti Bhatnagar : శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో నటించిన హీరోయిన్ గురించి తెలుసుకుందాం .సెలబ్రిటీలు ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వలన వాళ్లకు సంబందించిన విషయాలు ఫాన్స్ కి, జనాలకు ఈజీగా చేరువవుతున్నాయి.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి మూవీ ఎంతటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ సరసన రవళి తో పాటు దీప్తి భట్నాకర్ నటించి ఆడియన్స్ మనసు దోచుకుంది. సి అశ్వినీదత్, అల్లు అరవింద్ కల్సి నిర్మించిన ఈ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దీప్తి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన మా అన్నయ్య మూవీలో ‘మైనా ఏమైనావే’ సాంగ్ లో నటించి మెప్పించిన దీప్తి ఆ తర్వాత తమిళం,తదితర భాషల్లో దృష్టి పెట్టడం వలన తెలుగులో పెద్దగా నటించలేకపోయింది. ప్రస్తుతం భర్తతో కల్సి వ్యాపారంలో భాగస్వామ్యం వహిస్తోంది. ఇండస్ట్రీలో మంచి కెరీర్ ఉండగానే వ్యాపారవేత్త రణదీప్ ఆర్యను ప్రేమించి పెళ్లాడింది.

యూపీలోని మీరట్ పరిసర ప్రాంతాల్లో హ్యాండీ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ పెట్టి రాణిస్తోంది. సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరించే దీప్తి తాజాగా షేర్ చేసిన ఫోటో పలువురిని ఆకర్షిస్తోంది. ఆమె అందానికి ఫిదా అవుతూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.