Healthhealth tips in teluguKitchen

ఇలా తీసుకుంటే కీళ్ల మధ్య శబ్ధం లేకుండా జిగురు పెరిగి కీళ్లనొప్పులు తగ్గుతాయి

Joint Pains Foods In telugu : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య పెద్దగా ఉంటే డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు.
Joint Pains
ఈ కీళ్ల నొప్పులు అనేవి కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి. అలాగే కీళ్ల మధ్య శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఇలా శబ్దం రావడం కూడా కీళ్ళ నొప్పులకు సూచనగా భావించాలి. ఇలా కీళ్ల మధ్య శబ్దం రాగానే జాగ్రత్తపడాలి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం.
Joint pains in telugu
వారంలో 2 సార్లు సగ్గుబియ్యం, రాగులు,సజ్జలు తీసుకుంటే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. ఇవి అందరికీ అందుబాటు ధరలోనే ఉండటమే కాకుండా విరివిగా లభ్యం అవుతాయి. రాగులు, సజ్జల వాడకం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది. వీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

సగ్గుబియ్యం
సగ్గు బియ్యం అంటే మనలో చాలా మందికి తెలుసు. సగ్గుబియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. సగ్గుబియ్యం జావగా తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. సగ్గుబియ్యంలో calcium, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల మధ్య జిగురు కూడా పెరుగుతుంది. సగ్గుబియ్యము.ను జావ రూపంలోనూ, స్నాక్ రూపంలోనూ ఏ విధంగా తీసుకున్న ప్రయోజనం కలుగుతుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన మజిల్ గ్రోత్ కి, మజిల్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
finger millet In Telugu
రాగులు
రాగులను పూర్వ కాలం నుండి వాడుతున్నారు. రాగులును పిండి తయారు చేసుకుని జావగా తీసుకోవచ్చు. రొట్టెలు తయారుచేసుకొని తీసుకోవచ్చు. రాగులలో కాల్షియం, ఐర,న్ ప్రొటీన్లు, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి, ఎముకలు గుల్లగా లేకుండా బలంగా ఉండటానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి కీళ్ల మధ్య జిగురు పెరగటానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఎందుకంటే రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
sajjalu health benefits
సజ్జలు
సజ్జల లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, పీచు పదార్థం వంటివి సమృద్ధిగా ఉంటాయి. .ఇవి కండరాలకు శక్తిని ఇస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. సజ్జలను అన్నంగా వండుకుని తీసుకోవచ్చు. సజ్జలు.ను పిండిగా తయారుచేసి రొట్టెలు చేసుకోవచ్చు. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.