Pawan kalyan బద్రి సినిమా ఎన్నికోట్ల లాభాన్ని తెచ్చిందో తెలుసా ?

pawan kalyan badri Movie :సుమన్ హీరోగా పాండు… కృష్ణ హీరోగా తిల్లానా .. రెండు సినిమాలు వచ్చినట్టే వచ్చి ఆగిపోయాయి. సాంగ్స్,షూటింగ్ కూడా చేసినా ఎందుకో ఆగిపోయాయి. దూరదర్శన్ లో పనిచేసిన పూరి జగన్నాధ్ కి డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరలేదు. రోజుకి పది కథలు రాయగలడు,దూరదర్శన్ లో వంద ఎపిసోడ్స్ తీయగలడు.

నిన్నే పెళ్లాడతా, సింధూరం,గులాబీ, రంగీలా సినిమాలకు టివి ట్రైలర్స్ ఇతనే చేసాడు. కానీ ఓ కథతో పవన్ కళ్యాణ్ తో తీయాలని డిసైడ్ అయ్యాడు. సుస్వాగతం మూవీతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న పవన్ కలవాలంటే మార్గం దొరకడం లేదు. శ్యాం కె నాయుడు ఫ్రెండ్ కనుక అతడి సోదరుడు చోటా కె నాయుడు ద్వారా పవన్ కలవాలని డిసైడ్ అయ్యేడు.

అయితే కథ చెబితే,నచ్చితే పవన్ తో పరిచయం ఏర్పాటు చేస్తా అని చెప్పేసాడు. దాంతో ఒరిజనల్ కథ కాకుండా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాడు. నచ్చేసింది. అరగంట టైం ఇవ్వడంతో పూరి వెళ్ళాడు. కానీ అరగంటలో కథ అవ్వదని చెప్పడంతో అయితే వెళ్లిపొమ్మన్నాడు పవన్. అరగంట వినండి ,నచ్చితే కంటిన్యూ చేస్తా, లేదంటే నా దారిన వెళ్ళిపోతా అని పూరి అనేసరికి పవన్ ఒకే.

కథ స్టార్ట్ చేసాక టైం చాలా అయిపొయింది. ఒకే చెబుతూనే క్లైమాక్స్ మార్చి తెమ్మన్నాడు. ఒకే చెప్పినందుకు ఆనంద పడుతూనే మార్పు చెప్పినందుకు బాధగా అన్పించింది. ఏడు రోజుల్లో ఏడు క్లైమాక్స్ లు రాసాడు. కానీ ఎందుకో వాటిని చెంచేసాడు. పవన్ దగ్గరకి వెళ్లి క్లైమాక్స్ వినిపిస్తే ఇది పాతదే కదా అన్నాడు. 7 రాసినా ఇదే బాగుందనిపించిందని అందుకే వాటిని చించేశానని చెప్పుకొచ్చాడు.

నీ మీద కాన్ఫిడెన్స్ కోసం టెస్ట్ చేశా. తమ్ముడు షూటింగ్ అవ్వగానే ఇది స్టార్ట్ చేద్దాం అని పవన్ చెప్పేసరికి పూరిలో ఆనందం. ఈలోగా ఎవరికో ఫోన్ చేస్తే, ప్రొడ్యూసర్ టి త్రివిక్రమరావు వచ్చారు. మా సినిమా ఒకే. మీరే ప్రొడ్యూసర్ అని పూరి చెప్పేసరికి ,పవన్ ఇంత తొందరగా డేట్స్ ఇస్తాడని అనుకోలేదు. పైగా మెగాస్టార్ తో కొండవీటి దొంగ మూవీ టైం లో షూటింగ్ స్పాట్ కి వెళ్లిన పవన్ ని త్రివిక్రమరావు రిసీవింగ్ పవన్ కి గుర్తొచ్చింది.

మూడు లక్షలు అప్పు చేసి ఓ ఆఫీసు తీసాడు. ఈలోగా ఆర్టిస్టుల సెలెక్షన్. ముంబయ్ తో కాంటాక్ట్ చేయడంతో రేణు దేశాయి హీరోయిన్. అమీషా పటేల్ సెకండ్ హీరోయిన్. అయితే హీరోయిన్స్ ని అటూఇటూ చేంజ్ చేసారు. హీరో పేరు నంద, విలన్ పేరు బద్రి పెట్టారు. వాటిని రివర్స్ చేసారు. చెలి టైటిల్ అనుకున్నారు. కానీ బద్రి కన్ఫర్మ్.

మధు అంబటి కెమెరా మెన్. రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్. టాకీ పార్ట్ అంతా కూడా హైదరాబాద్ లోనే కొన్ని సాంగ్స్ కి న్యూజిలాండ్ వెళ్లారు. 2000 ఏప్రియల్ 20 బద్రి రిలీజ్. పవన్ కి మరో హిట్ పడింది. పూరి డైరెక్టర్ గా సక్సెస్. బద్రీగా ఫైట్స్,యాక్షన్ ,అన్నీ సూపర్భ్. విలన్ నందగా ప్రకాష్ రాజ్ నటన కూడా హైలెట్. హీరోయిన్స్ కూడా బాగా చేసారు.

రమణ గోగుల అందించిన బాణీలు ఎక్కడా చూసినా కుర్రకారుని ఊపేసాయి. మల్లికార్జునరావు,బ్రహ్మానందం కామెడీ అదుర్స్ . 85సెంటర్స్ లో 50రోజులు, 47సెంటర్స్ లో 100రోజులు ఆడింది. మొత్తం మీద బద్రి సూపర్ హిట్. అందుకే పూరి పెద్ద ఆఫీసు కట్టి అందులో బద్రి లామినేషన్ ఫోటో ఉంటుంది. వెండితెరకు పరిచయం అవుతూ హిట్ కొట్టిన సినిమా కదా. ఈ సినిమా 18 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది.