Tollywood విలన్స్ రెమ్యునరేషన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Tollywood villains remunerations : ఈ మధ్య సినిమాలలో హీరోకి సమానంగా విలన్ పాత్ర ఉంటుంది. విలన్ ఎంత బలంగా ఉంటె, హీరోయిజం అంతగా పవర్ ఫుల్ అవుతుంది. ఈ సూత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కృష్ణవంశీ వంటివాళ్ళు పక్కాగా ఫాలో అవుతున్నారు. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం విలన్ లకు మంచి డిమాండ్ వచ్చేసింది. హీరోలు సైతం నెగెటివ్ షేడ్ చేయడనికి సిద్ధం అవుతున్నారు.
విలన్లకు రెమ్యునరేషన్ కూడా హీరోతో సమానంగా ఉంటోందని టాక్. తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్షన్ చిత్రంగా చెప్పుకుంటే కృష్ణవంశీ అంతపురం సినిమాలో విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయి, హైలెట్ అయ్యాడు. అప్పటి నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింతగా రాణిస్తూ, విలన్ క్యారెక్టర్ కు కోటి యాభై లక్షలు చొప్పున ఒక్కో మూవీ తీసుకుంటాడని టాక్. సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం అయితే రోజుకు పదిలక్షల వరకు అందుకుంటాడని అంట
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతిబాబు విలన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని,ఒక్కో సినిమాకు 2 కోట్లకుపైగా తీసుకుంటున్నట్టు టాక్. లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా నిల్చిన సోనూసూద్ భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా విలన్ గా సెట్ అవుతాడు. టాలీవుడ్ లో అరుంధతి మూవీతో విలన్ గా క్లిక్ అయిన సోనుసూద్ ఒక్కో సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటున్నాడని టాక్.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో సంపత్ విలన్ గా మంచి గుర్తింపు కొట్టేసాడు. టాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్న యితడు ఒక్కో సినిమాకు 60 లక్షల నుంచి 70 లక్షల వరకూ తీసుకుంటున్నాడని టాక్. అసలు హీరో క్యారెక్టర్ ని చంపేసి ఈగ రూపంలో పగ తీర్చుకునే నేపదంతో రాజమౌళి తీసిన ఈగ మూవీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ నటుడు సుదీప్ ఒక్కో సినిమాకు 3 కోట్లు అందుకుంటాడట. దబాంగ్ -3 లో కూడా యితడు విలన్ గా చేసాడు.
రేసుగుర్రం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ మంచి మార్కులు కొట్టేసాడు. ఇక మెగాస్టార్ నటించిన సైరాలో కూడా నటించాడు. ఒక్కో మూవీకి 50 లక్షలు అందుకుంటాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన హీరో సాయి కుమార్ విలన్ క్యారెక్టర్ అయినా, సపోర్టింగ్ రోల్స్ అయినా 50 లక్షలు చొప్పున ఒక్కో మూవీకి అందుకుంటాడని టాక్.
కోలీవుడ్ లో చాలా సినిమాల్లో విలన్ గా చేస్తున్న హరీష్ ఒక్కో మూవీకి 50 లక్షలు అందుకుంటున్నాడు. రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ లో లీడ్ రోల్ చేసిన వివేక్ ఒబేరాయ్ ఆతర్వాత రూటు మార్చేసి, రామ్ చరణ్ హీరోగా నటించిన వినేయ విధేయ రామలో మెయిన్ విలన్ గా చేసి,3 కోట్ల రూపాయిలు అందుకున్నాడు. డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడైన హీరో ఆది పినిశెట్టి హీరోగా చేస్తూనే ఛాన్స్ వస్తే, విలన్,సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ఒక్కో సినిమాకు కోటి వరకు అందుకుంటున్నాడట.