బన్నీని ‘పరుగు’లు పెట్టించిన హీరోయిన్‌ గుర్తుందా… ఏమి చేస్తుందో తెలుసా…?

Parugu heroine sheela kaur :అల్లు అర్జున్‌ పరుగు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన sheela kaur చాలా తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమకు దూరంగా వెళ్ళింది. సినిమా రంగంలో వచ్చిన వాళ్ళందరూ రాణించలేరు. కొందరికి ఛాన్సులు రావు, కొందరికీ వచ్చినా సెలక్ట్ చేసుకోవడంలో తేడా వలన ఎక్కువకాలం నిలబడలేరు. అదే విధంగా హీరోయిన్ షీలా కౌర్ కూడా ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది.

ఇంతకీ ఆమె ఎవరంటే, టాలీవుడ్ లో ఆ ఆమధ్య తీసిన సీతాకోక చిలుక మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షీలా 2008లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కూడా నటించి మంచి ఛాన్స్ కొట్టేసింది. అయినా తర్వాత పెద్దగా రాణించలేదు. మస్కా, అదుర్స్, పరమ వీర చక్ర వంటి మూవీస్ లో చేసింది.

ఇక కన్నడ, మలయాళం, తమిళం, హిందీ మూవీస్ లో నటించిన షీలా ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేక పోయింది. ఇక సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని మేరేజ్ చేసుకుని, వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. 2018లో హైపర్ మూవీలో నటించడమే ఆమె చివరి చిత్రం. ఇక సినిమాల్లో ఛాన్స్ లు కూడా రాకపోవడంతో బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది.