MoviesTollywood news in telugu

Radhamma kuthuru సీరియల్ హీరో అరవింద్ రియల్ లైఫ్…ఎలా ఉంటుందో…?

Radhamma kuthuru serial hero Gokul :Radhamma kuthuru సీరియల్ ప్రేక్షక ఆదరణ పొంది సక్సెస్ గా ముందుకు సాగుతుంది. రాధమ్మ కూతురు సీరియల్ లో అక్షర భర్తగా హీరో అరవింద్ అద్భుత నటన ప్రదర్శిస్తూ, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నాడు. చెన్నైలో జన్మించిన ఇతడి అసలు పేరు గోకుల్ మీనన్. ఇతడి తండ్రి ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఉద్యోగి. మదర్ జయప్రద గృహిణి. ఇతడికి సింగర్ తనూజ్ అనే బ్రదర్ ఉన్నాడు.

చెన్నైలో 10వ తరగతి వరకూ చదువుకున్నాడు. బిటెక్ పూర్తిచేసాడు. చిన్నతనంలోనే నటనమీద ఆసక్తి ఉండడంతో కాలేజీ డేస్ లోనే మోడలింగ్ లోకి ఎంటరయ్యాడు. యాడ్స్ లో కూడా చేసిన అరవింద్ తర్వాత విజయ టివిలో ఓ సీరియల్ లో ఏడాదిపాటు విలన్ రోల్ వేసాడు. అదే సమయంలో మజాయే మజాయే అనే మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించాడు.

స్టార్ మాలో ప్రసారమైన జ్యోతి సీరియల్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన గోకుల్ కి జీ తెలుగులో ప్రసారమవుతున్న రాధమ్మ కూతురు సీరియల్ లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. బుజ్జమ్మ కొడుకుగా నటిస్తున్నాడు. కమల్ హాసన్ అంటే గోకుల్ కి ఇష్టం ట్రావెలింగ్ , ఫోటో షూట్ అంటే ఇష్టపడే గోకుల్ 5 అడుగుల 11అంగుళాల పొడవు ఉంటాడు. రాయల్ ఎంఫీల్డ్ బైక్ ఉంది. ఒక్కో ఎపిసోడ్ కి బాగానే అందుకుంటాడట.