Healthhealth tips in telugu

Mouth ulcer:ఒక్క రోజులో నోటి పూత పోవాలంటే…ఇలా చేస్తే సరి

Mouth ulcer Home Remedies in telugu : నోటి పూత రావడానికి మనం తీసుకునే ఆహారం ప్రధాన కారణం కావచ్చు. నోటి పూత తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అదే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించి ఆ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది.

తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. నోటిపూతను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. తులసి ఆకులను శుభ్రంగా కడిగి నోట్లో ఉంచుకుని నిదానంగా నమిలి ఆ రసాన్ని మింగాలి. దాంతో కాస్త ఉపశమనం కలుగుతుంది.

ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది. అలాగే ఈ సమస్య తిరిగి రాకుండా కూడా ఉంటుంది.లవంగం నూనె కూడా చాలా బాగా సహాయపడుతుంది లవంగాలను మెత్తగా చేసి నూనెలో వేడి చేయాలి.

ఈ నూనెను కాటన్ సాయంతో నోటి పూత లేదా పొక్కులు ఉన్న ప్రదేశంలో రాయాలి. పది. నిమిషాలయ్యాక శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా చేసుకోవటం వీలు కాని వారు మార్కెట్లో దొరికే లవంగం నూనెను వాడవచ్చు.

అలోవెరా జ్యూస్ తీసుకుంటే తొందరగా నోటిపూత తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటిపూతను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలోవెరా జ్యూస్ మార్కెట్లో లభ్యమవుతుంది.

లేదా కలబంద మొక్కలు ఉంటే జ్యూస్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ చిట్కాలన్నీ పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.