కొత్త బంగారు లోకం సినిమా మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?

Kotha Bangaru Lokam Movie :వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన Kotha Bangaru Lokam సినిమా ఘన విజయం సాదించి వరుణ్ సందేశ్ కి మంచి ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కుర్రకారును బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో పాటలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొత్తబంగారు లోకం సినిమాలో మొదటగా హీరోగా నాగ చైతన్యను అనుకున్నారు. అయితే నాగార్జున నాగ చైతన్య మొదటి సినిమా మాస్ సినిమా ఉండాలని…ఆ ఆఫర్ ని రెజెక్ట్ చేసారట.

ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉండగా శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో మోయిన్ రోల్ చేసిన వరుణ్ సందేశ్ ని చూసి ఇతనైతే బాగా సెట్ అవుతాడని దిల్ రాజు భావించి… వరుణ్ సందేశ్ ని అడగటం ఓకే చెప్పటం సినిమా హిట్ అవ్వటం జరిగిపోయింది.