Singer sunitha ఎంతమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిందో తెలుసా?

Tollywood singer sunitha :singer sunitha గాయనిగా మనకు బాగా తెలుసు. అలాగే ఆమె ఎంతో మంది హీరోయిన్ లకు గాత్ర దానం చేసింది. ఇటీవలే రామ్ వీరపనేని ని పెళ్లాడిన సింగర్ సునీత తరచూ వార్తల్లో నిలుస్తోంది. రోజూ ఏదో ఒక అప్ డేట్ తో వార్తల్లో కనిపిస్తోంది.19 సంవత్సరాల వయస్సులోనే కుమార్ గోపరాజుతో సునీత వివాహం జరగగా కొన్ని కారణాల వల్ల ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని, ఇప్పుడు రామ్ వీరపనేనిని పెళ్లిచేసుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.

ఇక అందంగా ఉండే సునీతకు పదుల సంఖ్యలో సినిమా ఆఫర్లు వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయితే కేవలం సాంగ్స్ పాడడమే కాకుండా కొందరు స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి,స్టార్ స్టేటస్ అందుకుంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పొందింది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూనే సునీత యాంకర్ గా కూడా తానేమిటో నిరూపించుకున్న సునీత గులాబి మూవీలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ సాంగ్ ద్వారా సింగర్ గా ఎంట్రీ ఇచ్చి, ఇక వెనక్కి తిరిగి చూడలేదు.

చిన్న వయస్సులోనే సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో కెరీర్ సాఫీగా నడుస్తోంది. మీరా జాస్మిన్,శ్రియ,అనుష్క,తమన్నా,జెనీలియా,సౌందర్య,భూమిక వంటి స్టార్ హీరోయిన్స్ కి సునీత డబ్బింగ్ చెప్పి ఆకట్టుకుంది. దాదాపు 500 సినిమాలకు సునీత డబ్బింగ్ చెప్పిందంటే మామూలు విషయం కాదు.