తమతో కలిసి నటించిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలు

Tollywood Star Heros Married Star Heroines : చాలామంది హీరో, హీరోయిన్స్ కల్సి నటిస్తారు. సినిమాలు హిట్ మీద హిట్ కొడితే, హిట్ ఫెయిర్ గా నిలుస్తారు. అయితే ఇందులో కొన్ని జంటలు పెళ్లిచేసుకున్న ఘటనలు ఉన్నాయి. కొందరు ఒక సినిమాతోనే ప్రేమలో పడి పెళ్లాడిన వాళ్ళు ఉన్నారు. సాక్షి,మంచి కుటుంబం, మంచి మిత్రులు వంటి సినిమాల్లో నటించిన కృష్ణ,విజయనిర్మల పెళ్లి చేసుకుని ఎన్నో సినిమాల్లో కల్సి నటించారు.

శివ,కిరాయిదాదా,నిర్ణయం,ప్రేమయుద్ధం వంటి సినిమాల్లో కలిసి నటించిన నాగార్జున,అమల 1992జూన్ 1న పెళ్లి చేసుకున్నారు. తెలుగునాట విపరీతంగా పేరు తెచ్చుకున్న సుమలత, కన్నడ నటుడు అంబరీష్ కల్సి కన్నడంలో కొన్ని సినిమాల్లో చేసారు. 1991డిసెంబర్ 8న పెళ్లిచేసుకున్నారు. తలంబ్రాలు, అంకుశం, ఆహుతి వంటి సినిమాల్లో కల్సి నటించిన డాక్టర్ రాజశేఖర్, జీవిత కల్సి 19991లో పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్,ఊహ ఇద్దరూ కల్సి, కూతురు,ఆయనగారు, ఊహ వంటి సినిమాల్లో చేసారు. 1997జనవరి 20న పెళ్లి చేసుకున్నారు.

వంశీ అనే మూవీలో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కల్సి నటించారు. 2005ఫిబ్రవరి 10న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సుందరాంగుడు వంటి సినిమాల్లో నటించిన సూర్య,జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న పెళ్లిచేసుకున్నారు. బద్రి,జానీ సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ 2009జనవరి 28న పెళ్లిచేసుకున్నారు. అయితే వీరు విడాకులు తీసుకున్నారు.

హ్యాపీ డేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆతర్వాత పడ్డానండి ప్రేమలో మరి మూవీలో వితిక తో కల్సి నటించి ఇద్దరూ ప్రేమలో పడి2016ఆగస్టు 19న పెళ్లిచేసుకున్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ తమిళ హీరో ప్రసన్న ఓ తమిళ మూవీలో చేసి, 2011మే 12న పెళ్లి చేసుకున్నారు.

మస్తీ వంటి హిందీ సినిమాల్లో కల్సి నటించిన జెనీలియా,రితేష్ 2012ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకున్నారు. అజిత్,షాలిని కూడా సినిమాల్లో నటించి, ప్రేమించి2000లో పెళ్లిచేసుకున్నారు. రాధిక, శరత్ కుమార్ కొన్ని సినిమాల్లో చేసి, 2001ఫిబ్రవరి 4న పెళ్లి చేసుకున్నారు. శివబాలాజీ,మధుమిత ఇద్దరి కల్సి ఓ సినిమాలో నటించి 2009మార్చి 1న పెళ్లి చేసుకున్నారు.