Healthhealth tips in telugu

గ్లాస్ పాలల్లో పావు స్పూన్ పొడి కలిపి తాగితే జీవితంలో డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు

kalonji milk health benefits in telugu : కలోంజీ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. కానీ ప్రస్తుతం చాలా విరివిగా లభిస్తుంది. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటున్నారు. వాటిలో కలోంజీ పాలు అనేవి ఒకటి.

కలోంజీ పాలను తాగితే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, రాగి, భాస్వరం మరియు ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి. kalonji seeds వెగించి మెత్తని పొడిగా తయారుచేసుకొని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్ వేడి పాలల్లో పావు స్పూన్ పొడి కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ఈ పాలను తాగటం వలన స్టామినా పెరుగుతుంది.అలసట,నీరసం,నిసత్తువ వంటివి తొలగిపోతాయి. శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. దాంతో సీజనల్ వ్యాధులు రావు.

దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి తొలగిపోతాయి. జీర్ణక్రియ బాగా జరగటానికి సహాయపడి మలబద్దకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

గర్భదరణ సమయంలో కూడా తీసుకోవచ్చు. ఆ సమయంలో వచ్చే రక్తహీనతను తొలగిస్తుంది. పిల్లల ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే kalonji seeds ఉపయోగించే ముందు ఒకసారి డాక్టర్ ని సంప్రదించి వాడితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.