Healthhealth tips in telugu

ఇది కలుపుమొక్క అనుకుంటే పొరపాటే..ఈ విషయం తెలిస్తే అసలు వదలరు

Mulla Thota Kura Health benefits in telugu : పంట పొలాల్లో ఎక్కువగా కలుపు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలియక మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ పల్లెటూర్లలో ఉండేవారు ఈ మొక్కలను ఉపయోగించుకొని వాటి ప్రయోజనాలను పొందుతారు.

వరి పొలాల్లో ఎక్కువగా కనిపించే ముళ్ళ తోటకూరలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఆకుకూర కొమ్మల చివర ముళ్ళు ఉంటాయి. అందుకే ముళ్ళ తోటకూర అని పిలుస్తారు. ఈ ముళ్ళ తోటకూర ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో లభిస్తుంది.వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
kidney problems
ఈ చెట్టు వేర్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టి నిల్వ చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ఈ వేరును సాన మీద అరగదీసి అరస్పూన్ మోతాదులో తీసుకొని గ్లాస్ నీటిలో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి.

గాయాలు అయినప్పుడు ముళ్ళ తోటకూర ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి రాస్తే రక్తస్రావం ఆగటమే కాకుండా తొందరగా నయం అవుతుంది. అలాగే దద్ధుర్లు వచ్చినప్పుడు కూడా ఈ పేస్ట్ రాస్తే తొందరగా తగ్గుతాయి.
Kidney problems
అయితే చిన్న చిన్నగా ఉన్న రాళ్ళు మాత్రమే కరుగుతాయి. అయితే ఏ సాంప్రదాయ వైద్యాన్ని అయినా తీసుకునే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.