ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకొని తాగితే ఏమి అవుతుందో తెలుసా ?
Hot Water Jaggery Benefits: ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి . ప్రతిరోజు బెల్లం తింటే కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.అదే ఆ గోరువెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క కలుపుకుని తాగితే ఇంకా రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విధంగా బెల్లం నీటిని తాగటం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది.
బెల్లం జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా బరువు తగ్గటానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కిడ్నీకి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో విషాలను బయటకు పంపుతుంది.
ఇంకా చెప్పాలంటే శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాకుండా. ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. నీరసం,నిసత్తువ,అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉండేలా చేస్తుంది.. బెల్ల నీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క వేసి కరిగే వరకు బాగా కలపాలి.
ఈ బెల్లం నీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. చిన్న బెల్లం ముక్క తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని కూడా తాగవచ్చు. శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. పొట్ట కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఉదయం సమయంలో బెల్లం నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.