ఎండా కాలంలో తాటి ముంజలు ఎందుకు తినాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు
Taati Munjalu Benefits : వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీటిని పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. వీటిల్లో విటమిన్ బి, విటమిన్ కె, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, calcium, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, జింక్, ఐరన్ వంటివి సమృద్దిగా ఉంటాయి.
తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండుట వలన వడదెబ్బ తగలకుండా మరియు శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంచి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే క్లాట్స్‌ను ముంజలు నివారిస్తాయి.
పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది.కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. వీటిని తింటే శక్తి వస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ముంజల్లో పుష్కలంగా ఉండే ఫైటోకెమికల్స్ వృదాప్య లక్షణాలను ఆలస్యం చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అధిక బరువును తగ్గించటంలో సహాయపడుతుంది.
కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.