టాలీవుడ్ లో హీరోయిన్స్ పవర్ ఎలా ఉంటుందో చూపించిన హీరోయిన్స్

Tollywood heroines:సినిమా అనగానే మనందరికీ హీరోయిజం కన్పిస్తుంది. హీరోకి వేల్యూ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉన్నా ఇప్పుడు కేవలం గ్లామర్ కోసమే హీరోయిన్స్ ని పెడుతున్నారు. పైగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురేసి హీరోయిన్స్ ని కూడా పెడుతున్నారు. సాంగ్స్ కోసమే వీళ్లంతా అనేలా మారిపోయింది.
arundhathi Movie
అయితే కొందరు హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ హీరోయిజం గల పాత్రలలో కూడా రాణించి తమ సత్తా చాటారు. ఎంతలా అంటే హీరో లేకున్నా సరే,ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా కొందరు హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి మెప్పించారు.
tollywood heroine anushka
స్వీటీ అనుష్క ను తీసుకుంటే అరుంధతి మూవీ రాకముందు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తుందని భ్రమపడ్డారు. కానీ అరుంధతి లో అనుష్క నటన చూసాక 2009 సమయంలో ఇంత బడ్జెట్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీయా అని అందరూ ఖంగుతిన్నారు. తీరా సినిమా చూసాక ఫిదా అయ్యారు. జేజమ్మగా రాజసం,మరోవైపు కళ్ళల్లో భయం ఉట్టిపడే పాత్రలో అనుష్క రెండు రోల్స్ లో అదరగొట్టేసింది. మగధీర తర్వాత ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ ఇదే.

తెలుగులో కీర్తి సురేష్ చేసిన మహానటి మూవీ ఒక బయోపిక్ మూవీ.సావిత్రి పాత్రలో ఆమె జీవించింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ సినిమా చూడని వాళ్ళు సైతం ఈ మూవీకోసం థియేటర్ బాట పెట్టారంటే ఇది ఏ రేంజ్ లో ఉందొ చూడొచ్చు. ఈ సినిమా కోసమే కీర్తి హీరోయిన్ అయిందా అన్నట్లు ఉంది ఈమూవీ. ఆరోజుల్లో ఎన్టీఆర్ ,అక్కినేని సినిమాను ఏలుతున్న రోజుల్లో సావిత్రి గొప్ప నటిగా రాణించిందంటే మామూలు విషయం కాదని ఈ సినిమా చూసాక తెలుస్తుంది.

గ్లామర్ పాత్రలతో అలరించిన సమంత ఓ బేబీ మూవీతో తన నట విశ్వరూపం ఏమిటో చూపించింది. ఒక యంగ్ యాజ్ లో ఉన్న అమ్మాయి బామ్మలా ప్రవర్తించడమే ఓ మిరాకిల్. అలాంటి పాత్రలో సమంత ఒదిగిపోయి థియేటర్లలో ఈలలు వేయించింది. 80ఏళ్ల వయస్సులో పరుగెడుతున్న సీన్,రావు రమేష్ ని కన్నబాబు అని పిలిచే సీన్ .. ఇలా అన్నిచోట్లా మనకు బేబీ క్యారెక్టర్ తప్ప సమంత కన్పించదు.

నయనతార ఒకప్పుడు హీరోల సరసన సపోర్టింగ్ రోల్స్ తో కన్పించి,ఆతర్వాత తానేమిటో ప్రూవ్ చేసుకుంది. దెన్ కే మదర్ మూవీలో ఆమె నటన చూసాక నయన్ అంటే ఏమిటో తెల్సింది. మయూరి తర్వాత కర్తవ్యమ్ వంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా నిల్చింది. ఇక పార్వతి తిరువొత్తు ఊయారే మూవీలో నటన చూస్తే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ప్రేమలో దెబ్బతినడం,ఏదైనా సాధించాలనే పట్టుదల కనిపిస్తాయి. ఈమె తెలుగులో ఎప్పుడు చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.