సిసింద్రీ సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా…ఎన్ని కోట్ల లాభమో ?
Akkineni akhil Sisindri Movie: అక్కినేని ఇంట మూడవ వారసుడిగా కేవలం 12 నెలల పసికందు అఖిల్ ని హీరో రేంజ్ ఇస్తూ సినిమా తీయడమే ఒక సాహసం. అయితే ఈ మూవీ అంచనాలను దాటి సూపర్ హిట్ అయింది. నాగార్జున,అమల తనయుడు అఖిల్ నటించిన ఈ మూవీ సిసింద్రీ.1995లో సెప్టెంబర్ 14న వచ్చిన ఈ మూవీలో నాగార్జున, టబు, అమల,శరత్ బాబు తదితరులు నటించిన ఈ మూవీ వచ్చి అప్పుడే పాతికేళ్ళు అయింది.
ఇంగ్లీషు మూవీ బేబీస్ డై అవుట్ మూవీ చూసి, ఇలాంటి మూవీ తెలుగులో చేస్తే బాగుటుందని డైరెక్టర్ శివనాగేశ్వర రావు తన గురువు రామ్ గోపాల్ వర్మ ను అడిగితె ప్రొసీడ్ అన్నాడు. నాగ్ తో గల పరిచయంతో ఇంటికి వెళ్లి అఖిల్ డేట్స్ అడిగేసరికి అమల సీరియస్ గా కుదరదని చెప్పేయడంతో ఘరానా బుల్లోడు షూటింగ్ లో ఉన్న నాగ్ ని ఎప్రోచ్ అవుతూ,బేబీస్ డై సిడి ఇచ్చాడు.
కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే నాగ్ ఒకే చేసినా ఆమె నో అంది. దాంతో బ్లు క్రాస్ సొసైటీ కోసం ఈ పిక్చర్ లాభాలతో ఓ బిల్డింగ్ కొందాం అని చెప్పడంతో ఆమె ఒకే చెప్పింది. గ్రేట్ ఇండియా బ్యానర్ స్టార్ట్ చేసి అఖిల్ హీరోగా సినిమా నిర్మాణానికి స్వయంగా నాగ్ ప్రకటించాడు. అక్కినేని కూడా మొదట్లో వద్దన్నా తర్వాత ఒకే చెప్పారు. మరుదూరి రాజాను డైలాగ్స్ కి తీసుకున్నారు.
కోటి నుంచి విడిపోయిన రాజ్ ని మ్యూజిక్ కి సెలెక్ట్. తల్లి క్యారెక్టర్ కి అమలను అనుకున్నా చివరకు ఆమని సెలెక్ట్. ఇక పిల్లాడిని కాపాడే క్యారెక్టర్ కి జగపతి బాబుని అనుకోగా, స్వయంగా తానె యాక్ట్ చేస్తానని నాగ్ ప్రకటించాడు. 1995మేలో అక్కినేని క్లాప్ తో షూటింగ్ స్టార్ట్. పసివయస్సులో అఖిల్ నుంచి నటన రాబట్టుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖం చూపించడానికి ఆమనీ,శరత్ బాబు సీన్ లోకి వచ్చేవారు.
ముఖం కనపడని షాట్స్ లో నాగ్ ,అమల ఉండేవారు. ఏడుపు సీన్ కోసం రోడ్డుమీద అమల వదిలేసి వెళ్ళిపోతే ఏడుస్తాడు. కొంతసేపటికి అమల తిరిగొచ్చి ఎత్తుకుంది. ఇక క్లైమాక్స్ లో బ్లు క్రాస్ సాయంతో రకరకాల జంతువులను తెచ్చారు. ఇవన్నీ మద్రాసులో తీయగా, ఇంటీరియర్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియాలో చేసారు. టబు,పూజా బాత్రా స్పెషల్ సాంగ్స్ ఫ్రీగా చేసారు.
నాగ్ రెమ్యునరేషన్ లేకుండా కోటిన్నర బడ్జెట్. 75రోజుల వర్కింగ్ డేస్ తో ఆగస్టుకి షూటింగ్ పూర్తి. సెప్టెంబర్ లో మూవీ రిలీజయింది. ఆసక్తిగా ఎదురుచూసిన జనానికి మంచి రిలీఫ్ ఇచ్చింది. ఎమోషన్, హాస్యం, సెంటిమెంట్ ,సాంగ్స్ ఇలా మూవీ బాగా కనెక్ట్ అయింది. సూపర్ హిట్ పత్రికలో అఖిల్ బొమ్మ కవర్ పేజీగా వేశారు. చిన్ని తండ్రీ సాంగ్ అప్పట్లో తల్లీ పిల్లలకు ఓ హైలెట్. ఆటాడుకుందాం రా సాంగ్ యూత్ ని ఊపేసింది.
ఆరుకోట్ల వరకూ షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ 34సెంటర్స్ లో 50డేస్,7సెంటర్స్ లో 100రోజులు ఆడింది. ఇచ్చిన మాట ప్రకారం బ్లు క్రాస్ సొసైటీ కోసం అమలకు బంజారా హిల్స్ లో నాగ్ ఓ బిల్డింగ్ కొనిచ్చాడు. ఇక చిన్నపిల్లాడిని ఏడిపించి నటించేలా చేసారని బాలల హక్కుల నుంచి అమలకు నోటీసులొచ్చినా తర్వాత వీగిపోయాయి. అఖిల్ కి నాలుగు సంస్థలు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చాయి. తమిళంలో డబ్బింగ్ చేస్తే అక్కడా హిట్.