నిద్ర త‌గ్గుతోందా..? అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. తస్మాత్ జాగ్రత్త

Good Sleep Tips : నిద్ర అనేది మ‌న‌కు అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. వేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది.. కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర… ఈ రెండింటిలో దేనిలోనైనా తేడా వస్తే మనిషి అనారోగ్యం పాలవుతాడు. పరిస్థితి విషమిస్తే మరణానికి దగ్గరవుతాడు. ప్ర‌తి ఒక్క‌రు నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. అదే పిల్ల‌లు, వృద్ధులు అయితే 8 నుంచి 10 గంట‌ల పాటు నిద్ర‌పోవాల్సి ఉంటుంది.

కానీ ప్ర‌స్తుతం ఉన్న ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చు కుంటున్నారు. అయితే నిద్ర త‌క్కువ‌గా పోతే ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.రోజూ నిద్ర త‌క్కువ‌గా పోతే ప‌నిచేసే ఉద్యోగుల్లో చురుకుదనం పోతుంద‌ట‌.

అలాగే యాక్టివ్‌గా ప‌నిచేయ‌లేర‌ట‌. దీంతోపాటు డ్రైవింగ్ చేసేట‌ప్పుడు నిద్ర వ‌చ్చి యాక్సిడెంట్లు అయ్యేందుకు కూడా అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. నిద్ర త‌క్కువ‌గా పోవ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త కోల్పోతామ‌ని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప‌ని చేయాల‌న్నా విసుగు చెందుతామ‌ట‌. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోతే గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.
Diabetes diet in telugu
నిద్ర త‌గ్గితే అధికంగా బ‌రువు పెర‌గ‌డంతోపాటు డ‌యాబెటిస్ కూడా వ‌స్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. నిద్ర త‌గ్గితే శృంగారంలో స‌రిగ్గా పాల్గొన‌లేర‌ని, డిప్రెష‌న్ బారిన ప‌డ‌తార‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంద‌ని, వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌రగా వ‌స్తాయ‌ని కూడా వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.