7 రోజుల్లో అధిక బరువు,బొడ్డు మరియు నడుము చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది

Belly Fat Reduce Tips in telugu : ప్రస్తుతం ఉన్న రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు,ఆయిల్ ఫుడ్స్,ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినటం, సరైన వ్యాయామం లేకపోవటం,ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
Weight Loss tips in telugu
ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి గ్లాసున్నర నీటిని పోసి అరస్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా ఒక అంగుళం దాల్చినచెక్క వేయాలి. ఆ తర్వాత ఒక అంగుళం అల్లంను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ డ్రింక్ ని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.

ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ అయ్యాక అరగంట గ్యాప్ ఇచ్చి తాగాలి. గ్యాస్ సమస్య లేనివారు ఉదయం పరగడుపున తాగవచ్చు. దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోదిస్తుంది. అలాగే శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
Ginger benefits in telugu
ఇక అల్లం అనేది ఆకలి నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నిమ్మరసం శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. అలాగే పొట్ట దగ్గర,తొడల దగ్గర, చేతుల దగ్గర ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.