30 ఏళ్లుగా తగ్గని డయాబెటిస్ వ్యాధిని తగ్గించే అద్భుతమైన అకులు…మన ఇంటిలో ఉండేవే…
Diabetes Control leaves : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కూడా ఆహారం తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ ఉన్నవారిలో కీలకమైనది. డయాబెటిస్ ఉన్నవారు ఇప్పుడు చెప్పే 3 ఆకులను ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నీం
ప్రతి రోజు పరగడుపున రెండు లేదా మూడు లేత వేప ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగాలి. వేప ఆకులలోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఇన్సులిన్‌ను కొవ్వు మరియు కండరాల కణాలలోకి తీసుకోవడాన్ని పెంచుతుంది. అందువల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.
ప్రతి రోజు పరగడుపున నాలుగు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగాలి. కరివేపాకులో విటమిన్లు, బీటా కెరోటిన్ మరియు కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఆక్సీకరణ నష్టాన్ని నివారించి దయబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది.
ప్రతి రోజు పరగడుపున 4 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగాలి. డయాబెటిస్ తో బాధపడే వారిలో ఇన్సులిన్ గ్రంథి ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా తులసి ఆకులు చేస్తాయి. దీంతో డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన 3 ఆకులు సులభంగానే లభ్యం అవుతాయి. మందులు వాడుతూ ఈ ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.