MoviesTollywood news in telugu

Gamyam సినిమా వెనక కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో?

Gamyam Movie :  ఫార్మసీ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవడం గొప్పగా ఉంటుందని అతడి భావన. ఎం ఎస్ కంప్యూటర్స్ చేయడానికి యు ఎస్ వచ్చి, సినిమాలమీద ఇంటరెస్ట్ తో అటే మొగ్గాడు. అతడే క్రిష్ జాగర్లమూడి. యుఎస్ లోనే సినిమా చేసేద్దామని అనుకున్న కుదరలేదు. ఎన్నో స్టోరీస్ రాసుకుంటూ కూర్చునే వాడు.
sarvanand movies
ఇక ఇండియా వచ్చాక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పెట్టి, అలా సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలని ప్లాన్. ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఓ కంపెనీలో ఉంటూ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. కెమెరా మెన్ రసూల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ఒకరికి ఒకరు మూవీకి క్రిష్ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఆ పనీ ఈ పనీ అని కాకుండా చివరకు అన్నీ చేస్తూ అందరితో కలిసిపోయాడు. చివరకు ఆఫీస్ బాయ్ రాకపోతే టీ కూడా పెట్టి ఇస్తూ,ఒక్క సినిమాతోనే ఎంతో నేర్చేసుకున్నాడు.

ఈలోగా అశ్వినీదత్ బాలీవుడ్ లో గాంధీ,గాడ్సే గురించి కథ తో సినిమా తీయాలని చెప్పడంతో డ్రైవర్ తో కల్సి బయలుదేరాడు. దారిలో డ్రైవర్ తో జరిగిన సంభాషణ తన వెర్షన్ జోడించి రూమ్ కి వెళ్లి ఓ కథ రాసాడు. ఈలోగా లో బడ్జెట్ మూవీతో సినిమాకు కథ ఉందా అని స్పప్న దత్ ఫోన్. ఈలోగా యుఎస్ నుంచి వచ్చిన కుర్రాళ్ళు సినిమా తీయడానికి యువసైన్యం పేరుతొ ఓ స్టోరీ రెడీ చేయమని చెప్పడం జరిగింది.
Rao Ramesh unknown Facts
కానీ దానికన్నా తన దగ్గర కథే నయం అనుకుని,ఇది రాఘవేంద్రరావు కాకుండా తానే సొంతంగా చేయాలనీ,సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గరకు వెళ్లి వినిపించాడు. మార్పులు చేర్పులు చెప్పడంతో మళ్ళీ 9నెలల విరామం తర్వాత రాసుకొస్తే, ఒకే చెప్పడమే కాదు, పాటలు ఉచితంగా రాస్తానని సిరివెన్నెల భరోసా ఇచ్చేసారు. అలా టాలీవుడ్ లోకి వచ్చిన దర్శకుడు క్రిష్ తొలిసారి తెరకెక్కించిన మూవీ గమ్యం. తొలిసినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.
gamyam movie
కానీ ఈమూవీ తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబా తీయడానికి ముందుకి వచ్చారు. అల్లరి నరేష్,శర్వానంద్ ఒకే అయ్యారు. కమిలిని ముఖర్జీ ఎక్కువ డిమాండ్ చేసినా,ఆమెనే సెలెక్ట్ చేశారు. రావు రమేష్ క్యారెక్టర్ ఒకే. హరి అనుమోలు కెమెరా. ఇక నక్సల్ పాత్ర కోసం చాలామందిని అనుకున్నా,ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సూచన మేరకు ఆ పాత్రను క్రిష్ చేసేసాడు. 57 రోజుల్లో షూటింగ్ పూర్తి. గమ్యం,గాలిపటం టైటిల్స్ లో గమ్యం ఫైనల్. ప్రివ్యూ చూసినా ఎవరూ కొనడం లేదు. హిట్ అయితేనే క్రిష్ కి లైఫ్. లేకుంటే యుఎస్ వెళ్లిపోవాలన్న కండీషన్. మొత్తానికి 2008ఫిబ్రవరి 29న గమ్యం రిలీజయింది. హిట్ కొట్టింది. క్రిష్ ని స్టార్ డైరెక్టర్ చేసింది.