ఈ ఫొటోలో ఉన్న బాలనటులు స్టార్ హీరో,స్టార్ హీరోయిన్…గుర్తు పట్టారా…?

Tollywood Stars:చిన్నప్పుడు సినిమాల్లో చేసి,పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ గా వస్తే గుర్తుపట్టడం అంత ఈజీకాదు. ఎందుకంటే, ప్రస్తుతం స్టార్ హీరోలుగా,హీరోయిన్స్ గా కొనసాగుతున్న వాళ్ళలలో చాలామంది మనల్ని చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి ఆతర్వాత స్టార్ లుగా ఎదిగినవాళ్ళే ఉన్నారు. ఆ లిస్ట్ లో గతంలో శ్రీదేవి ,రోజా రమణి, మొదలు ఇప్పటి నటీనటుల్లో మహేష్ బాబు, రాశి,మీనా,హన్సిక,ఎన్.టి.ఆర్, తమన్నా, తరుణ్ ఇలా చాలామంది స్టార్స్ ఉన్నారు. అయితే నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని చాలామందికి తెలీదు. పైగా నందమూరి నటసింహం బాలయ్యతోనే నటించాడు.

కళ్యాణ్ రామ్ నటించిన ఆ చిత్రం వివరాల్లోకి వెళ్తే, 1989 లో కోడి రామ కృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ,సుహాసిని జంటగా ‘ బాలగోపాలుడు ‘ అనే చిత్రం చేశారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ రామ్ తొలిసారిగా తెరకు పరిచయమయ్యాడు ఇందులో బాలయ్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉంటారు. అందులో ఒకరు రాశి మరొకరు కళ్యాణ్ రామ్ వీరిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కళ్యాణ్ రామ్, రాశి చేసిన నటన వాళ్లకు, ప్రేక్షకులకు ఒక స్వీట్ మెమరీగా నిలిచిపోయింది.

నందమూరి కళ్యాణ్ రామ్ పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చి,లక్ష్మీ కళ్యాణం, హరే రామ్,పటాస్ వంటి చిత్రాలతో పాటు పలు చిత్రాల్లో నటించి ఆడియన్స్ మెప్పు పొందాడు అంతేకాదు, ఓ పక్క హీరో గా చేస్తూనే మరోపక్క ప్రొడ్యూసర్ గా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇక బాలయ్య కూతురుగా చిన్నపిల్లగా నటించిన రాశి పదేళ్ళ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణబాబు చిత్రంలో బాలయ్య సరసున హీరోయిన్ గా చేసి,మెప్పించింది. ఇది ఇండస్ట్రీకి కొత్తెమికాదు,నందమూరి తారకరమారావు మానవరాలిగా నటించిన శ్రీదేవి ఆతరువాత ఎన్టీఆర్ తో జోడీ కట్టి దాదాపు పాతిక సినిమాల్లో హిట్ ఫెయిర్ గా నిలిచారు.