Beauty TipsHealth

2 రూపాయిల ఖర్చుతో ముఖం మీద ముడతలు,నల్లని మచ్చలను మాయం చేయవచ్చు

Nutmeg Beauty Benefits In telugu : ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. మనం మసాలా దినుసుగా వాడే జాజికాయ చర్మ సౌందర్యంలో చాలా బాగా సహాయపడుతుంది.
nutmeg
పురాతన కాలం నుండి జాజికాయను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీనికోసం జాజికాయ పొడిని తీసుకోవాలి. ఒక బౌల్ లో అర స్పూన్ జాజికాయ పొడి పావు స్పూన్ చందనం పొడి వేసి నీటితో పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మొటిమలు,నల్లని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి
Honey
ఒక బౌల్ లో అర స్పూన్ తేనె వేసుకొని దానిలో పావు స్పూను జాజికాయపొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పాలు వేసి దానిలో పావు స్పూను జాజికాయపొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముడతలు తొలగిపోయి ముఖం యవ్వనంగా మృదువుగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.