వెంకటేష్ ఎత్తుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి

Venkatesh and Mahesh babu :అవునా,ఎప్పుడు,ఏ మూవీ .. కొత్తగా వస్తోందా ఇలా అనుకోవడం సహజమే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తన టాలెంట్ తో వరుస విజయాలతో దూసుకెళ్తూ సూపర్ స్టార్ అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అయ్యాడు.
Venkatesh
ఇక విక్టరీ వెంకటేష్ కూడా సినీ నేపధ్యం గల మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ చూపిస్తూ విక్టరీ గా ఎదిగాడు.ఇక వీళ్ళిద్దరూ కల్సి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అన్నదమ్ములుగా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మహేష్ బాబుని వెంకీ ఎత్తుకున్నట్లు ఉన్న ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
mahesh babu
ఇంతకీ ఎప్పుడంటే, చిన్నప్పుడు మహేష్ పుట్టినరోజుకి వెంకీ హాజరయ్యాడు. ఆ సందర్బంగా తీసిన ఈ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది . ఘట్టమనేని వారసుడిని ఎత్తుకున్న దగ్గుబాటి బాసూ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫాన్స్ షేర్ చేస్తున్నారు.