ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా … వెంటనే ఆలస్యం చేయకుండా చూసేయండి

Tollywood Heroine Sneha:సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఓ హీరోయిన్ పిక్ హల్ చల్ చేస్తోంది. తెలుగులో సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన “తొలి వలపు” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన నటి స్నేహ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందాల తారగా అందరి దృష్టిలో పడింది. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
Tollywood Heroine sneha
తెలుగులో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, బాలకృష్ణ, సుమంత్, తరుణ్, శ్రీకాంత్ తదితర హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులను స్నేహ బాగానే అలరించింది.అయితే తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కి వదిన పాత్రలో నటించింది.ప్రస్తుతం పలు తమిళ భాషకి సంబందించిన సినిమాలతో బిజీగా ఉంటోంది.
sneha and prasanna
ఇక ఈ మధ్య స్నేహ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు. చిన్నప్పుడు స్నేహ చాలా క్యూట్ గా ఉందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి స్నేహ పెళ్లి చేసుకున్న తర్వాత చాలావరకూ సినిమాలు తగ్గించింది.