Healthhealth tips in telugu

రోజుకి 2 ముక్కలు తింటే వృద్ధాప్య లక్షణాలను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Amla health benefits : మారుతున్న జీవనశైలి కారణంగా చాలా చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు. వృద్ధాప్య లక్షణాలను తగ్గించటంలో ఉసిరి చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. ఉసిరికాయలను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి. బాగా ఎండిన ఈ ఉసిరి ముక్కలు సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి.

వీటిలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కొల్లజన్ కణజాలాన్ని రక్షించి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. అలాగే ఉసిరికాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గించి యవ్వనంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Usirikaya benefits
ఎండిన ఉసిరి ముక్కలను తినవచ్చు. లేదా పొడిగా తయారుచేసుకొని తేనె కలిపి తీసుకోవచ్చు. చర్మం మీద ముడతలు రాకుండా కాపాడుతుంది. ఉసిరి తాజాగా దొరికినప్పుడు ఉసిరి పచ్చడి లేదా కషాయం చేసుకొని తీసుకోవచ్చు. ఉసిరి నోటి పూతను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.