‘త్రినయని’ హీరో విశాల్ కి ఎన్ని కోట్ల ఆస్థి ఉందో తెలుసా?
Trinayani Serial Actor Vishal : Tv సీరియల్స్ మన జీవితాలలో ఒక బాగం అయ్యిపోయాయి. తమ అభిమాన సీరియల్ చూడకపోతే ఆ రోజు ఏమి తోచదు అలా సీరియల్స్ చూడటానికి అలవాటు పడిపోయారు, త్రినయని సీరియల్ హీరో గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. కొందరు డబ్బు సంపాదించాలని ఆయా రంగాల్లోకి వస్తారు.
అలాగే ఏమీ లేకుండా వచ్చి సినిమాల్లో లక్షలు కోట్లు కూడబెట్టినవాళ్లు ఉన్నారు. కానీ త్రినయని సీరియల్ లో హీరోగా చేస్తున్న విశాల్ పుట్టకతోనే ధనవంతుడు. అతడి తండ్రి భైరప్ప బెంగుళూరులో పెద్ద వ్యాపారవేత్త. అన్నీ ఉండికూడా గుర్తింపు లేదని తపించేవాడు. బెంగళూరులో స్టడీస్ పూర్తిచేసాడు. ఐటి లో డిగ్రీ చేసి, కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసాడు.
చిన్న చిన్న స్కిడ్స్ చేయడం విశాల్ కి అలవాటు. దాంతో అందరూ హీరోగా ట్రై చేయవచ్చని అనేవారు. కానీ ఎపుడు సీరియస్ గా తీసుకోలేదు. తండ్రి వ్యాపారం వదిలేసి, సొంత వ్యాపారం కూడా స్టార్ట్ చేసాడు. భైరప్ప కొడుకులా కాకుండా తనకంటూ ఓ గుర్తింపు రావాలని భావించేవాడు. ఇతడి అసలు పేరు చందు. మంచి ఫిజిక్ గల పర్సనాలిటి. దాంతో ఫ్రెండ్ ద్వారా చెప్పడం చూసి తల్లి కూడా నటనవైపు అడుగులే పడేలా చేసారు.
రియల్ ఎస్టేట్ కోసం ఓ ప్రమోషన్ యాడ్ చేసి డబ్బులు తీసుకున్నాడు. అలా మోడలింగ్ వైపు అడుగులు వేసాడు. ఆడిషన్స్ కి వెళ్ళేవాడు. అయితే లావుగా ఉన్నావని, బాడీ ఎక్కువని, తెల్లగా ఉన్నావని ఇలా రకరకాల కారణాలతో తిరస్కరించేవారు. చివరిసారిగా కన్నడ గృహలక్ష్మి సీరియల్ కి వెళ్లి ఏవో నాలుగు డైలాగులు చెప్పడంతో సెలక్ట్ అయినట్లు కబురొచ్చింది. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు కూడా బాగా చూస్తాడు. తనవాడుగా తెలుగు ఆడియన్స్ ని తనని ఆదరించడం ఆనందంగా ఉందని చందు అంటున్నాడు.