విజయశాంతికి పెద్ద షాక్ ఇచ్చిన చిరంజీవి….30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళితే

Chiranjeevi And Vijaya Santhi:లేడి అమితాబ్ గా తెలుగు సినీ పరిశ్రమను 90లో ఏలిన విజయశాంతి కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక బ్రహ్మాండమైన పార్టీని ఎరేంజ్ చేసారు. ఒకప్పుడు చిరంజీవి,విజయశాంతి సూపర్ హిట్ జోడి. ఆ తర్వాత రాజకీయాల్లో శత్రువులుగా మారిన వీరు ఎక్కడ కలిశారు…ఎప్పుడు కలిశారు అనే సందేహం రాక మానదు. విజయశాంతికి చిరంజీవి పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Chiranjeevi Dance Skills
కానీ ఇప్పుడు కాదు….32 సంవత్సరాల క్రితం. మరి ఈ విషయం ఇప్పుడు ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నారా?ఈ విషయాన్నీ స్వయంగా విజయశాంతి చెప్పింది. మే 9 1991 లో విడుదల అయిన సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ లో వీరిద్దరూ జత కట్టారు. ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వర్షాన్ని కురిపించేదని టాక్ ఉండేది.
hiranjeevi Gang leader
విజయశాంతి అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంది.గ్యాంగ్ లీడర్ సినిమాలో భద్రాచలం కొండ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కర్తవ్యం సినిమాలో నటనకు ఉత్తమ నటి అవార్డు వచ్చిందనే సంగతి తెలిసిందట. అప్పుడు చిరంజీవి షూటింగ్ అయిన వెంటనే పెద్ద పార్టీ ఏర్పాటు చేశారట.
karthavyam telugu full movie
బాలీవుడ్ తారలు గోవిందా,దివ్య భారతిలను కూడా పార్టీకి పిలిచి విజయశాంతిని సర్ ప్రయిజ్ చేశారట చిరంజీవి.ఈ సందర్భంగా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తింది. ఇప్పటి హీరోలు డాన్స్ లు బాగా చేస్తున్న చిరు స్టైల్ ని మించిన వారు ఎవరు లేరని చెప్పింది విజయశాంతి.