Healthhealth tips in telugu

Diabetes Care:మీకు డయాబెటిస్ ఉందా..? మధుమేహం ఉన్న వాళ్లు తినాల్సిన 5 పండ్లు ఇవే..!

Diabetes Care : డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారిలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. చాలా మందికి పండ్లను తీసుకొనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. ఈ రోజు డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన పండ్ల గురించి తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలు : డయాబెటిస్ ఉన్న‌వారు తినవలసిన పండ్ల‌లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. రోజుకు 2,3 స్ట్రాబెర్రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి స‌హాయ ప‌డుతుంది.
jamakaya
జామకాయ : జామకాయలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోజు ఒక జామకాయ తినవచ్చు.
Orange Health Benefits in telugu
నారింజ : డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆలోచన లేకుండా నారింజను తినవచ్చు. ఈ పండులో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంతోపాటు డయాబెటిస్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తుంది. నారింజ పండ్ల‌లో ఉండే సెలీనియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

దానిమ్మ పండు : దానిమ్మ పండ్ల‌లో ఫైబ‌ర్ సమృద్దిగా ఉంటుంది. దీనిలో మూడు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజు ఒక దానిమ్మ పండును తినవచ్చు.

ద్రాక్ష : షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి. పండ్లను లిమిట్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పండ్లను తీసుకొని ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.