ఈ యాంకర్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా…?
Telugu actress anitha chowdary :జెమిని టివిలో రఘు తో కల్సి తొలిరోజుల్లో పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 పేరిట ఓ ప్రోగ్రాం చేసిన యాంకర్ అనితా చౌదరి అంటే తెలియనివారుండరు. ఆడియన్స్ రాసిన ఉత్తరాలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చే ప్రోగ్రాం ఇది. అప్పట్లో జెమిని టివిలో అత్యధిక టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్న ప్రోగ్రాం ఇది.
16 ఏళ్లకే అలా కెరీర్ స్టార్ట్ చేసి,ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడమే కాదు,ఈటివి,మాటివి,జి తెలుగు ఇలా అన్ని చానల్స్ లో కూడా యాంకర్ గా ఒక రేంజ్ లో తన ప్రోగ్రామ్స్ తో దూసుకెళ్లింది.ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టిన అనిత సపోర్టింగ్ యాక్టర్ గా ఎన్నో సినిమాల్లో చేసింది. సంతోషం,మురారి,ఉయ్యాలా జంపాలా , రారండోయ్ వేడుక చూద్దాం, ఆనందం,నీ ప్రేమకై,నువ్వే నువ్వే వంటి ఎన్నో సినిమాల్లో చేసింది.
ఇలా బుల్లితెర ,వెండితెరమీద మంచి పేరు తెచ్చుకున్న అనితా చౌదరి ఎన్నారై ని పెళ్ళాడి,ఇండస్ట్రీకి దూరమైంది. కొడుకు పుట్టడంతో అతడి కోసం ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో ఇండస్ట్రీకి దూరంగా జరిగింది. అనిత ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. భర్త అమెరికాలో ఉండడం వలన మొత్తం బుల్లితెరకు దూరంగా జరిగిందని చెప్పాలి. చిన్నవయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన అనిత చిన్న వయస్సులోనే తల్లి పాత్రలోకి వచ్చేసింది.
ఉయ్యాలా జంపాల మూవీలో తల్లిగా చేసింది. అమెరికాలో సక్సెస్ ఫుల్ గా ఉన్నవాళ్లను కల్సి వాళ్ళ జీవితాలను ఈటీవీలో అక్కడ నుంచే చూపిస్తోంది. ఓ ఛారిటీ సంస్థ ద్వారా ఎంతోమందికి చేయూతనిస్తోంది. ఈమె భర్త ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉండికూడా తెలుగువారి కోసం యాంకరింగ్ చేస్తున్న ఈమె మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుందా అని అడిగితె మంచి కథ దొరికితే నటించడానికి సిద్ధం అంటోంది.