Healthhealth tips in telugu

వేసవిలో ఖర్బూజ పండును తప్పనిసరిగా తినాలి…ఆ కారణం తెలిస్తే…అసలు వదలరు

Kharbooja Benefits : ఖర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో.ఇది దోస రకానికి చెందింది కాబట్టి కొంత మంది కూరగాయగా వర్గీకరిస్తుంటారు. ఖర్బూజ పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ లోపల మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. ఖర్బూజను మస్క్ మిలాన్ అని కూడా పిలుస్తారు.
muskmelon
ఖర్బూజ వేసవిలో వేసవి తాపాన్ని తగ్గించటంలో చాలా బాగా సహాయాపడుతుంది. ఖర్బూజ అందరికి అందుబాటులో ఉండే ధరలోనే లభ్యం అవుతుంది. ఈ పండు రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది. ఖర్బూజలో 92 శాతం నీరు ఉండుట వలన వేసవిలో శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేసి తక్షణ శక్తిని అందిస్తుంది.

ఖర్బూజలో విటమిన్ ఏ, సి వంటివి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఫ్లూయిడ్స్ ‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. ఒక కప్పు ఖర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్‌ లభిస్తుంది. దీనివల్ల ఎటువంటి గుండె సమస్యలు రావు. రక్తపోటును తగ్గించటమే కాకుండా రక్తంలో చక్కర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగించటంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలని అనుకొనే వారు ఖర్బూజ తింటే బరువు తగ్గుతారు. ఎందుకంటే ఖర్బూజలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎటువంటి అభ్యంతరం లేకుండా కర్బుజను హ్యాపీగా తినవచ్చు. ఖర్బూజలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.
gas troble home remedies
ఆలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఖర్బూజలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన అల్సర్ మీద పోరాటం చేస్తుంది. ఖర్బూజలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం సమస్య నుండి బయట పడేస్తుంది. ఖర్బూజను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నరాలు, కండరాలను ఉత్తేజపరుస్తుంది. దీని వల్ల.. చాలా రిలాక్స్ గా నిద్రపడుతుంది.

ఖర్బూజ తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఖర్బూజ తొక్కలను నీటిలో వేసి ఉడికించి ఆ నీటితో మౌత్ వాష్ చేసుకుంటే.. పంటినొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఖర్బూజలో నీటి శాతం అధికంగా ఉండుట వలన  వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మరియు శరీరంలో హీట్ ని తగ్గించడానికి  చాలా బాగా సహాయపడుతుంది. 

ఖర్బూజ పండులో సమృద్ధిగా  పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండటం వలన అది హార్ట్ ఎటాక్ నుండి మరియు గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.ఖర్బూజ పండు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం, ఆకలి అనిపించకపోవడం వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఎముకలకు కావాల్సినన్ని పోషకాలను అందించి, బలంగా మారుస్తుంది. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.