MoviesTollywood news in telugu

బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చిన హరికృష్ణని తప్పించిందెవరో తెలుసా? నమ్మలేని నిజాలు

Tollywood Hero HariKrishna:తెలుగునాట ఎన్టీఆర్ అంటే ఆరాధ్య దైవంగా చూస్తారు. ఆయన పోషించని పాత్ర లేదు. ఏ పాత్ర వేసిన అందులో లీనమై నటించి మెప్పించడం ఎన్టీఆర్ సొత్తు. ఇక పౌరాణిక పాత్రలంటే ఎన్టీఆర్ చేయాల్సిందే. అంతలా ఎన్టీఆర్ కీర్తి గాంచారు. అయితే ఎన్టీఆర్ అంతటి హీరో అవ్వాల్సిన హరికృష్ణకు టాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చినా ఎవరో అడ్డుకున్నారట.

నిజానికి హరికృష్ణకు నాటకాలంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. అందునా పౌరాణికం అంటే ఇంకా ఇష్టం. గుడివాడలో శ్రీకష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని వేషం వేశారు. అది చూసిన డైరెక్టర్ పుండరీకాక్షయ్య శ్రీకృష్ణావతారం సినిమాలో చిన్ని కృష్ణుని వేషం ఇచ్చారు. అందులో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. ఆ విధంగా తండ్రీ కొడుకులు ఒకే సినిమాలో కృష్ణుని వేషంతో మెప్పించారు.

అంతేకాదు, ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్, ఉత్తమ బాల నటుడిగా హరికష్ణ పురస్కారాలు అందుకున్నారు. ఇలా ఒకే మూవీలో తండ్రి కొడుకులు పురస్కారం అందుకోవడం రికార్డు.హరికృష్ణ సినిమాలకు దూరంగా ఉండగా, దాదాపు 25ఏళ్ళ తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో సత్యం పాత్ర వేయమని పరిటాల రవి వత్తిడి చేయడంతో అందులో నటించి మెప్పించారు హరికృష్ణ. ‘నిజానికి ఆ వేషం వేయడానికి పరిశ్రమలో ఎవరూ ముందుకు రాలేదు.

ఎందుకంటే అది నక్సలైట్ పాత్ర. అందుకే ఎవరీ సత్యం మాస్టారు అని పరిటాలను అడిగాను. ఆయన ఓ మాస్టారు. నక్సలైట్ గా మారారు. చేతులు నరికినా సరే,ముంజేతులతో కరపత్రాలు రాసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని రవి వివరించారని,ముఖ్యంగా రాములయ్యను ఉత్తేజ పరిచిన వ్యక్తి గా చెప్పడంతో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను’అని హరికృష్ణ ఇంటర్యూలో చెప్పారు.

హరికృష్ణ చిన్నప్పటి నుంచి మొండిగా ఉండేవారట. తాతయ్య మాట తప్ప ఇంకెవరి మాటా వినేవారు కాదట. ఇదే విషయాన్నీ ఓసారి ఇంటర్యూలో హరికృష్ణ చెప్పుకొచ్చారు. ‘తాతయ్యతో తనకున్న బంధం బలమైనది. మాటల్లో చెప్పలేనిది. నా బాల్యమంతా నిమ్మకూరులోనే గడిచింది. నాకు ఇష్టమైన రీతిలో ఎంతో సరదాగా చిన్నప్పుడు నన్ను తీసుకెళ్లి తాతయ్య పెంచారు. అందుకే నాకు తల్లీ తండ్రి అన్నీ ఆయనే. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా హైదరాబాద్ వెళ్ళేవాడిని. దురదృష్టవశాత్తూ శంషా బాద్ లో పొలానికి వెళ్లి వస్తుంటే తాతయ్య చనిపోయారు.

అయితే నా తండ్రిని ఆ పొలం ఉండడానికే వీల్లేదంటూ నాన్న దాన్ని అమ్మేశారు’అని హరికృష్ణ ఆ ఇంటర్యూలో చెప్పారు. హరికృష్ణ ఇంకా విషయాలు చెబుతూ ‘నిజానికి తాతయ్య నేను ఆ పొలం కోసం చాలా కష్టపడ్డాం. అందుకే హైదరాబాద్ లో ఉండలేనని చెప్పేసాను. అయితే నాన్న ఉండాల్సిందే అన్నారు. ఊళ్లోని గొడ్డూ గోదా అమ్మనంటే వస్తానన్న షరతు మీద హైదరాబాద్ లో స్థిరపడ్డాను’అని చెప్పుకొచ్చారు. కాగా ఇక నటనలో తండ్రిని మించిన తనయుడు అవ్వాల్సిన హరికృష్ణ కు ఆ ఛాన్స్ తప్పిపోయిందో ఎవరు తప్పించారో ఓ సారి చూద్దాం.

హరికృష్ణ నటించిన తల్లా పెళ్ళామా చిత్రాన్ని హిందీలో బిడాయ్ గా తెరకెక్కించాలని నిర్ణయించిన ఎల్వి ప్రసాద్ అందులో కూడా హరికృష్ణనే నటుడిగా తీసుకోవాలని అనుకున్నారు. అయితే అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. దీని గురించి హరికృష్ణ గుర్తుచేసుకుంటూ ‘నేను ఎవరిమాటా వినేవాడిని కాదు. కోపం వస్తే తిట్టేవాణ్ణి. అయితే నాన్నకు ఎల్వీ ప్రసాద్ గురువు గారు. ఒకవేళ నా తొందర పాటులో ఏదైనా అనేస్తానేమోనన్న భయంతో వద్దన్నారు నాన్న’అని చెప్పారు.