MoviesTollywood news in telugu

మన టాలీవుడ్ హీరోలు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే నిజంగా షాక్ అవ్వటం ఖాయం

Tollywood Heroes Wifes Age:సాధారణంగా భార్య కన్నా భర్త వయస్సు ఎక్కువగా ఉండాలని అంటారు. గతంలో భారీగా ఏజ్ గ్యాప్ ఉండేది. గతంలో సగానికి సగం తేడా ఉండేది కూడా. కానీ రానురాను తగ్గింది. ఐదారేళ్ల గ్యాప్ కి మించి ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. అయితే మన సెలబ్రిటీల ఏజ్ గ్యాప్ చూస్తే షాకవ్వాల్సిందే. అందుబాటులో దొరికిన కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ చూస్తే చిత్ర విచిత్రంగా ఉంటుంది. మణిరత్నం – సుహాసినిల మధ్య ఆరేళ్ళ గ్యాప్ వుంది. అంటే సుహాసిని 6ఏళ్ళు చిన్నది. రజనీకాంత్ – లతలా మధ్య ఏడేళ్ల వయస్సు గ్యాప్ ఉంది.

లత 7ఏళ్ళు చిన్నదన్నమాట. రితేష్ కన్నా – జెనీలియా వయస్సు8ఏళ్ళు తేడా. అంటే జెనీలియా 8ఏళ్ళు చిన్నది. అజిత్ – షాలిని మధ్య 8సంవత్సరాల తేడా ఉంది. అజిత్ కన్నా షాలిని 8ఏళ్ళు చిన్నది. ఇక రోజా – సెల్వమణి ఏజ్ తేడా కూడా 9సంవత్సరాలే. సెల్వమణి కంటే రోజా 9ఏళ్ళు చిన్నది. రాధికా – శరత్ కుమార్ ల ఏజ్ గ్యాప్ కూడా 9సంవత్సరాలే.
Ntr family
శరత్ కన్నా రాధికా 9ఏళ్ళు చిన్నది. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి మధ్య 9ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. అంటే ఎన్టీఆర్ కంటే ప్రణతి 9ఏళ్ళు చిన్నది. రమ్యకృష్ణ – కృష్ణ వంశీల మధ్య 8 ఏళ్ళు తేడా ఉంది. రమ్యకృష్ణ 8ఏళ్ళు చిన్నది.ఇక క్రిష్ – సంగీత లు కేవలం ఒక ఏడాది తేడా. అకంటే క్రిష్ కంటే సంగీత ఒక ఏడాది చిన్నది. జ్యోతిక – సూర్య ల మధ్య రెండేళ్ల తేడా. సూర్య కంటే,జ్యోతిక రెండేళ్లు చిన్నది. అలాగే కుష్భు – సుందర్ ల మధ్య రెండేళ్ల తేడా. సుందర్ కంటే కుష్బూ రెండేళ్లు చిన్నది.

అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిల మధ్య రెండేళ్లు తేడా ఉంది. బన్నీ కన్నా స్నేహ వయసు రెండేళ్లు తక్కువన్నమాట. ప్రీతి విజయకుమార్ , హరి ల ఏజ్ గ్యాప్ 3ఏళ్ళు హరి కన్నా ప్రీతి 3ఏళ్ళు చిన్నది. కాగా రాహుల్ శర్మ – ఆసిన్ మధ్య 10ఏళ్ళు తేడా ఉంది. రాహుల్ కన్నా ఆసిన్ 10ఏళ్ళు చిన్నది. ఇక భర్తల కన్నా భార్యల వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్లు ఉన్నారండోయ్.

రామ్ చరణ్ ఉపాసన ల మధ్య నాలుగేళ్లు తేడా. అయితే ఇక్కడ నాలుగేళ్లు చిన్నవాడు చరణే. అంటే ఉపాసన పెద్దదన్నమాట. అలాగే ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ ల మధ్య మూడేళ్ళ వయస్సు తేడా. అంటే అభిషేక్ కన్నా ఐశ్వర్య మూడేళ్లు పెద్దది. అదేరీతిలో మహేష్ బాబు – నమ్రతల మధ్య మూడేళ్ళ వయస్సు తేడా. అంటే మహేష్ కన్నా నమ్రత మూడేళ్లు పెద్దది. అలాగే ధనుష్ – ఐశ్వర్య ల మధ్య ఏడాది తేడా. ధనుష్ ఓ ఏడాది చిన్నవాడు. అలాగే స్నేహ – ప్రసన్నల మధ్య ఏడాది తేడా. స్నేహ ఏడాది పెద్దది.