విటమిన్ B6 లోపం సమస్యతో బాధపడుతున్నారా….వీటితో సులభంగా చెక్….!
Vitamin B6 Deficiency:మన శరీరానికి అవసరమైన పోషకాల్లో బి6 ముఖ్యమైనది. నీటిలో కరిగే విటమిన్. శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి బి6 చాలా అవసరం. అయితే బి 6 విటమిన్ ని మన శరీరం తయారు చేసుకోలేదు. బి6 సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
మన శరీరానికి అవసరమైన బి 6 సరిగా అందక పోతే చర్మంపై దద్దుర్లు, పెదవులు పగలటం, నాలుక పూత, డిప్రెషన్, రోగనిరోధకశక్తి పనితీరు మందగించడం, నిస్సత్తువ, తొందరగా అలసిపోవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే బి6 చాలా అవసరం. ఈ విటమిన్ ఎక్కువగా చేపలు, పిస్తా పప్పు, అరటిపండు, అవకాడో, చికెన్, పాలకూర వంటి ఆహారాలలో సమృద్ధిగా ఉంటుంది.
ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే బి6 లోపం లేకుండా ఉంటుంది. శరీరంలో కొత్త కణాలు ఏర్పడేందుకు ఫోలిక్ యాసిడ్ సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. జీవ క్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. విటమిన్ బి 6 ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన గుండె జబ్బులు, క్యాన్సర్, కంటి సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.