MoviesTollywood news in telugu

తోబుట్టువులను పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్స్…. వారు కూడా నటులే

Tollywood Stars:బంధాలు అనుబంధాలు అంటారు కదా. కుటుంబంలో అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్లు,అమ్మా నాన్న ఇలా అందరితో అనుబంధం పెనవేసుకుంటుంది. సినిమా వాళ్ళు అయినా సరే ఈ బంధాలు ఉంటాయి కదా. సినిమాల్లో నటించాక ఇంటికి చేరిన నటీనటులు తమ అనుబంధాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తమ విషయాలను పంచుకుంటారు. అయితే ఇలా అనుబంధం పెనవేసుకున్న వాళ్లలో ఎవరైనా ఒకరు చనిపోతే మర్చిపోలేరు. బాధతో కుమిలిపోతుంటారు. అలా సొంత వాళ్ళను పోగొట్టుకున్నవాళ్లెవరో ఓ సారి చూద్దాం.
kalyana-chakravarty
లో ప్రొఫైల్ లో ఉంటూ మంచి నటుడిగా నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కొనసాగుతున్న సమయంలో తమ్ముడు హరీష్ చక్రవర్తి నటుడిగా వచ్చాడు. అయితో ఓ షూటింగ్ లో అనుకోకుండా బైక్ ప్రమాదంలో కన్నుమూశాడు.
Tollywood Hero Raviteja remuneration
రవితేజను తీసుకుంటే వీళ్ళు ముగ్గురన్నదమ్ములు. యితడు హీరోగా ఉంటూనే తమ్ముళ్ళిద్దరినీ ఇండస్ట్రీకి తెచ్చాడు. అయితే అతడికి వచ్చిన సక్సెస్ రేటు తమ్ముళ్లు భరత్,రఘులకు రాలేదు. అనుకోని పరిస్థితుల్లో తమ్ముడు భరత్ ని కోల్పోయాడు.

హీరోయిన్ సిమ్రాన్ సోదరి మోనాల్ కూడా హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక ప్రేమ విఫలం కావడంతో మరణించింది.

ఇక మరో హీరో గోపీచంద్ అన్నయ్య సినిమా డైరెక్ట్ చేస్తున్న సమయంలో కారు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ఇక తమిళనటుడిగా పరిచయం అయిన డానియల్ బాలాజీ తెలుగులో కాకా కాకా,సాహసం శ్వాసగా సాగిపో,ఘర్షణ సినిమాల్లో నటించాడు. అయితే యితడు తమ్ముడైన ప్రముఖ నటుడు మురళీని పోగొట్టుకున్నాడు. హృదయం సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన మురళీ తమిళంలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇతడి కుమారుడు కూడా హీరోగా నటుడిగా సెటిల్ అయ్యాడు. అయితే మురళి 2010లో హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు.

ఇక హీరోయిన్ అతిధి అగర్వాల్ సోదరి ఆర్తి అగర్వాల్ తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకుని,బరువు తగ్గే క్రమంలో ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో ప్రాణాలు కోల్పోయింది. ఊర్వశి,కల్పనా,కళారంజని ల తమ్ముడు ప్రిన్స్ కూడా హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.