Healthhealth tips in telugu

ల్యాప్ టాప్ కారణంగా ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

laptop health risks :ఈ రోజుల్లో లాప్ టాప్ వాడకం చాలా ఎక్కువ అయింది. ఇష్టం వచ్చిన విధంగా కూర్చొని లాప్ టాప్ వాడే సౌలభ్యం ఉండుట వలన ఈ తరం వారంతా లాప్ టాప్ అంటే ఇష్టపడుతున్నారు. ఇలా ఇష్టం వచ్చిన విధంగా కూర్చొని గంటల తరబడి లాప్ టాప్ వాడటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

అందువల్ల ల్యాప్‌టాప్‌ వాడేవారు కొన్ని జాగ్రత్తలను పాటించటం ముఖ్యం. వాటి గురించి తెలుసుకుందాం. ల్యాప్‌టాప్‌లను చాలా మంది ఒడిలో పెట్టుకొని ముందుకు వంగి కూర్చొని గంటల తరబడి పని చేస్తూ ఉంటారు. దీని వల్ల వెన్నుపూస మీద తెలియని భారం పడి వెన్నునొప్పి రావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమంగా స్పాండిలైటిస్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే తగిన ఎత్తున్న టేబుల్ మీద ల్యాప్‌టాప్‌ పెట్టి వాడాలి.

ల్యాప్‌టాప్‌ నుంచి సుమారు 52 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వెలువడుతుంది. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవటం వల్ల ఆ వేడికి వీర్యం నాణ్యత తగ్గి ఆ ప్రభావం సంతాన సాఫల్యత మీద పడుతోంది. అందుకే యువత ల్యాప్‌టాప్‌ ను పొరబాటున కూడా ఒడిలో పెట్టుకోవద్దు. ల్యాప్ టాప్ ఒడిలో పెట్టుకోవాల్సివచ్చినప్పుడు ఒడిలో మెత్తని దిండు వేసుకొని దానిమీద పెట్టుకోవాలి.

ల్యాప్‌టాప్‌ మీద పనిచేసేటప్పుడు ఎదురుగా లైట్‌ ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే ఆ కాంతి ప్రభావానికి కళ్ళు పొడిబారటం, నీళ్లు కారటం వంటి సమస్యలు వస్తాయి.ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ కు ముఖం దగ్గరగా పెట్టి ఎక్కువ సమయం చూడటం వల్ల కళ్ళు తీవ్ర ఒత్తిడికి లోనై ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌’ అనే నేత్ర సమస్య వస్తుంది. కనుక స్క్రీన్ ను తగిన దూరం నుంచి చూడాలి. అవసరాన్ని బట్టి యాంటీ గ్లేర్ కళ్లద్దాలు వాడాలి. 
finger massage
రోజంతా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పనిచేసేవారికి తొడ భాగంలో చర్మ సమస్యలు రావచ్చు. కొందరిలో ఇది చర్మ క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదం ఉంది. కనుక ఒడిలో పెట్టుకోవద్దు. ల్యాప్‌టాప్‌ ఇరుకైన కీ బోర్డును గంటల తరబడి వాడటం వల్ల వేళ్ల కండరాలు పట్టేయడం, వేళ్లకు రక్తప్రసరణ తగ్గి తిమ్మిరెక్కటం వంటి సమస్యలు రావచ్చు. కనుక పరిమిత సమయమే కీబోర్డు వాడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.